twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు.. పవన్ కల్యాణ్ నుంచి రెస్సాన్స్ లేదు.. జర్నలిస్టు ప్రభు సంచలన వ్యాఖ్యలు

    |

    తెలుగు సినీ పరిశ్రమలో మూడు దశాబ్దాలపాటు జర్నలిస్టుగా మారిన ప్రభు దర్శకుడిగా మారి రూపొందించిన రాంగ్ గోపాల్ వర్మ డిసెంబర్ 4వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సినీ పాత్రికేయులు, ప్రముఖులకు ప్రత్యేక షోను గురువారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రదర్శించారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో జర్నలిస్టు ప్రభు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన పుకార్లపై సమాధానం చెబుతూ..

    రకరకాల రూమర్లతో

    రకరకాల రూమర్లతో

    రాంగ్ గోపాల్ వర్మపై తాను చిత్రాన్ని తీస్తున్న సమయంలో నాపై అనేక రకాల రూమర్లు, పుకార్లు మీడియాలో వచ్చాయి. మెగా ఫ్యామిలీ నుంచి నాకు కొంత ప్యాకేజీ వచ్చింది. దాంతో నేను సినిమాను రూపొందించాననే మాటలు వినిపించాయి. అయితే సినిమాకు ముందు నేను మెగాస్టార్ ఫ్యామిలీతో మాట్లాడాను. కానీ నాకు వారి నుంచి ఎలాంటి రెస్సాన్స్ రాలేదు అని ప్రభు తెలిపారు.

    మెగా ఫ్యామిలీ మద్దతు కోసం

    మెగా ఫ్యామిలీ మద్దతు కోసం

    రాంగ్ గోపాల్ వర్మ అనే సినిమాను తీశానని మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఫ్యామిలీ సభ్యులకు ఫోన్ చేశాను. మద్దతు ఇవ్వాలని వారిని కోరాను. రాంచరణ్, పవన్ కల్యాణ్, చిరంజీవిని కలిసేందుకు ప్రయత్నించాను. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కనీసం నేను ఫోన్ చేసినా స్పందించలేదు. వారి నుంచి కూడా ఫోన్ కూడా చేయలేదు అని జర్నలిస్టు ప్రభు చెప్పారు.

     చిరు, పవన్‌ను తిట్టినందుకు తీయలేదు

    చిరు, పవన్‌ను తిట్టినందుకు తీయలేదు

    రాంగ్ గోపాల్ వర్మ చిత్రాన్ని చిరంజీవి కుటుంబాన్నో, పవన్ కల్యాణ్‌నో తిట్టినందుకు తీయలేదు. కేవలం సామాజిక కాలుష్యానికి కారణమవుతున్నందున్న రాంగోపాల్ వర్మను ఉద్దేశించి సినీ విమర్శనాస్త్రాన్ని సంధించాను. ఈ సినిమా కోసం నేను బ్యాంకులో లోన్ తీసుకొన్నాను. లాభనష్టాలను బేరిజు వేసుకోలేదు. తప్పుదారి పడుతున్న ఓ వ్యక్తికి సరైన సలహాలు, సూచనలు ఇవ్వడానికే నేను ఈ సినిమాను తీశాను అని ప్రభు స్పష్టం చేశారు.

    ఓ యువ నటి తీరుతో

    ఓ యువ నటి తీరుతో

    ఓ దశలో ఓ అమ్మాయి (యువ నటి) ప్రవర్తించిన తీరు వల్ల సినీ పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఆ సమయంలో దర్శకుడు వ్యవహరించిన తీరు దారుణంగా వ్యక్తమైంది. చిత్ర పరిశ్రమ తరఫున నిలబడేందుకు సినిమాను రూపొందించాను. ఆ సమయంలో చిత్ర పరిశ్రమ ఎందుకు చిరంజీవి కుటుంబం తరఫున ఎందుకు నిలబడలేదు. రాంగోపాల్ వర్మను ఎందుకు ప్రశ్నించలేదని ప్రభు నిలదీశారు.

    Recommended Video

    Disha ఎన్కౌంటర్ సినిమా పై RGV క్లారిటీ
    ఎవరో ఇచ్చిన ప్యాకేజీతో

    ఎవరో ఇచ్చిన ప్యాకేజీతో

    ఎవరో ఇచ్చే ప్యాకేజీల కోసం రాంగ్ గోపాల్ వర్మ తీయలేదు. గత 32 ఏళ్లుగా సినీ పరిశ్రమలో నా సొంత కాళ్లపౌ నిలబడ్డాను. ఎవరి ప్యాకేజీలకు తలవంచలేదు. ఇప్పుడు రాంగ్ గోపాల్ వర్మ సినిమా తీయాలనుకొన్నప్పుడే నా జీవితంలో పాటించిన నైతిక విలువలతో ముందుకెళ్లాను. నాపై ఎలాంటి పుకార్లు వచ్చినా అవి పుకార్లుగానే మిగిలిపోతాయి. రాంగ్ గోపాల్ వర్మ ఎవరినో అవమానించాలన్న ఉద్దేశంతో తీయలేదు అని ప్రభు చెప్పారు.

    English summary
    Wrong Gopal Varma director Journalist Prabhu sensational comments on Chiranjeevi, Pawan Kalyan. Wrong Gopal Varma is all set release on December 4. In this occassion, Prabhu clears all rumours over Wrong Gopal Varma
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X