twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబ్ల్యుడబ్ల్యుఇ స్టార్ ది గ్రేట్ ఖలీ... తెలుగు సినిమాలో, వివరాలు ఇవే!

    |

    డబ్ల్యుడబ్ల్యుఇ(వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టెన్మెంట్) ఫాలో అయ్యే వారికి ఇండియన్ రెజ్లర్ దలీప్‌ సింగ్‌ రాణా అలియాస్ ది గ్రేట్‌ ఖలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఖలీ తెలుగు అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలో ఈ ఏడు అడుగుల భారీ కాయుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

    ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నరేంద్ర' సినిమాలో ఖలీ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఖలీకి సినిమాల్లో, టీవీ షోల్లో నటించడం ఇదేమీ కొత్తకాదు, అయితే తెలుగులో ఆయన చేస్తున్న తొలి చిత్రం ఇదే.

    రెజ్లర్ పాత్రలో ఖలీ

    రెజ్లర్ పాత్రలో ఖలీ

    ‘నరేంద్ర' మూవీలో నీలేశ్‌ టైటిల్‌ రోల్ చేస్తుండగా... బ్రెజిలియన్‌ మోడల్, నటి ఇసబెల్‌ లీత్‌ హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్ట్ చూస్తుంటే రెజ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని, ఖలీ రెజ్లర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది.

    జయంత్ సి పరాన్జీ

    జయంత్ సి పరాన్జీ

    తెలుగులో ప్రేమించుకుందాం రా, శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ వంటి చిత్రాలను తెరకెక్కించి జయంత్ సి పరాన్జీ.... వరుస పరాజయాలతో వెనకబడిపోయారు. ఆయన చివరి చిత్రం ‘జయదేవ్' 2017లో విడుదలైంది. రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘నరేంద్ర' సినిమాతో మళ్లీ వస్తున్నారు.

    ఇండియా, పాకిస్థాన్

    ఇండియా, పాకిస్థాన్

    ఇండియా, పాకిస్థాన్ నేపథ్యంతో సినిమా ఉంటుందని, అందుకు తగిన లొకేషన్లలో సినిమా చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. స్టోర్ట్స్ బ్యాగ్రౌండ్ మూవీ కావడంతో అందుకు తగిన విధంగా భావోద్వేగాలు పండించేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారట.

    నరేంద్ర

    నరేంద్ర

    ‘నరేంద్ర' చిత్రాన్ని ఇషాన్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ సంపత్ తొలిసారి తెలుగు సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

    English summary
    WWE superstar The Great Khali makes his Telugu debut with Narendra. A directorial of Jayanth c Paranji and stars Nilesh Eti and izabellele. Music by Ram Sampath.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X