వైరస్‌లా వ్యాపిస్తున్న సంపూర్ణేష్ బాబు!
హైదరాబాద్: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, గీత్ షా హీరో హీరోయిన్లుగా దుహర మూవీస్ సమర్పణలో ఎ.యస్.ఎన్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం `http://www.వైరస్.కామ్`. నో వ్యాక్సిన్ ఓన్లీ టాక్సీన్ ఉపశీర్షిక. సిహెచ్. శివరామకృష్ణ దర్శకత్వంలో సలీం.ఎం.డి, కళ్యాణ్ దూళిపాళ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అన్నీ రకాల ఎలిమెంట్స్ ఉన్న కథతో రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇందులో సరికొత్త సంపూర్నేష్‌బాబును చూస్తారని చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేశారు. నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకోనున్న ఈ సినిమాలో వెన్నెలకిషోర్, వైవా హర్ష, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: మీనాక్షి భుజంగ్, కెమెరాః వి.జె, డ్యాన్స్ః శేఖర్, భాను, ఎడిటర్ః మార్తాండ్ కె.వెంకటేష్, ఫైట్స్ః నందు, నిర్మాతలుః సలీం ఎం.డి, కళ్యాణ్ దూళిపాళ, దర్శకత్వం సి.హెచ్,రామకృష్ణ.


Click it and Unblock the Notifications











