త్రిఫులెక్స్ ‘అమరావాతి’
దర్శకుడు, నటుడు అయినటు వంటి రఘబాబు మరో థ్రిల్లింగ్ కథాంశంతో 'అమరావతి" అనే సినిమాను తనదైన శైలిలో రూపొందిస్తున్నారు. ఒక సాధార నటుడుగా సాధర పాత్రలతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన రవిబాబు తెలుగు, కన్నడ భాష సినిమాలకు దర్శకత్వం వహించి తన ప్రతిభను చాటుకొన్నాడు. తెలుగులో 'అల్లరి" చిత్రంతో ధర్శకుడు అవతారమెత్తి అల్లరి రవిబాబుగా జనాధరణ పొందాడు. 'అనసూయ" సినిమాకి దర్శకత్వం వహించి ఆ సినిమాలో విలన్ గా థ్రిల్లింగ్ పాత్రని చక్కగా పోషించారు. ఈ చిత్రం తో పాటు నచ్చావులే వంటి సినిమాలు రూపొందించి వరుస విజయాలతో ప్రేక్షకులలో మంచి స్థానాన్ని సంపాదించుకొన్నారు.
చిత్రంలో అందాల భామలు భూమిక, స్నేహ కథాయికలు. మరో అందాల తార కూడా నటిస్తోందని సమాచారం. రసూల్ ఎల్లోర్ 'సంగమం" సినిమాలో ప్రేక్షకులకు పరిచయమైన సింధూర గద్దె సైతం ప్రధానమైన పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. రవిబాబు కీలక పాత్ర తో సైతం తారకరత్న నెగిటివ్ పాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది. 'అమరావతి సినిమాకి వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోస్ లో కీలక సన్నివేశాలతో పూర్తి కావస్తోంది. అక్టోబర్ మొదటి వారానికి షూటింగ్ పూర్తి చేసి నెలాఖరులో సినిమా విడుడలకు సిద్దం చేసుకొంటోంది.


Click it and Unblock the Notifications











