‘బాలకృష్ణ, రాజశేఖర్’పై రూమర్లు... వాటిని నమొద్దు.. అవన్నీ పచ్చి అబద్దాలే!
గతేడాది తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం విక్రం వేద. ఈ చిత్రం ఇప్పటికే హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారంటే వార్తలు వచ్చినా అవి తెర రూపం దాల్చలేదు. ప్రస్తుతం విక్రమ్ వేద సినిమా తెలుగులో నందమూరి బాలకృష్ణ, రాజశేఖర్ హీరోలుగా రీమేక్ అవుతున్నదనే వార్త సినీ వర్గాల్లో సంచలనం రేపుతున్నది. బాలయ్య, రాజశేఖర్ నటిస్తున్నారా అనే విషయంపై పూర్తి వివరాల్లోకి వెళితే..

వై నాట్ స్టూడియో ప్రకటనలో
2017లో తమిళంలో రిలీజైన విక్రమ్ వేద సినిమా రీమేక్ హక్కులను వైనాట్ స్టూడియోస్ సంస్థ దక్కించుకొన్నది. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, రాజశేఖర్‌తో మల్టీస్టారర్ చిత్రంగా సినిమాను రూపొందిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు వైనాట్ స్టూడియోస్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

అవన్నీ పచ్చి అబద్దాలేనని
విక్రమ్ వేద సినిమాలో బాలకృష్ణ, రాజశేఖర్ నటిస్తున్నట్టు వచ్చిన వార్తలు పచ్చి అబద్దం. ప్రింట్, ఇతర మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ రూమర్లే. దయచేసి అలాంటి వార్తలు నమ్మవద్దు అని వైనాట్ స్టూడియోస్ తమ ప్రకటనలో వెల్లడించింది.

త్వరలో అధికారికంగా వెల్లడిస్తామని
త్వరలోనే విక్రమ్ వేద సినిమా రీమేక్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడిస్తాం. అప్పటి వరకు మీడియాలో వచ్చే అవాస్తవ వార్తలను నమ్మవద్దు. దయచేసి ఈ సినిమాలో నటించే హీరోల పేర్లు, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అని ప్రకటనలో వైనాట్ స్టూడియో పేర్కొన్నది.

హిందీ రీమేక్ గురించి
విక్రమ్ వేద చిత్రాన్ని హిందీలో వైనాట్ స్టూడియో రీమేక్ చేస్తున్నది. వైనాట్ స్టూడియో, రిలయన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం మా మధ్య చర్చలు జరుగుతున్నాయి. హిందీలో ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తారు అని నిర్మాత ట్వీట్ చేశారు.

తమిళంలో విక్రమ్ వేద గురించి
విక్రమ్ వేద తమిళ వెర్షన్‌లో మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించారు. పుష్కర్, గాయత్రి దంపతులు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్, అచ్యుత్ కుమార్, ఈ రాందాస్ తదితరులు నటించారు. సామ్ సీఎస్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











