twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బయటపడిన బాలయ్య, జగన్ అసలు వ్యవహారం.. ఇదీ సంగతి!

    |

    Recommended Video

    Fans Serious Discussions Over NBK-Y.S.Jagan Paper Cutting || Filmibeat Telugu

    నందమూరి నటసింహం బాలకృష్ణకు అంతులేని అభిమాన వర్గం ఉంది. సినీ, రాజకీయ వర్గాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలయ్య బాబు ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ బాలయ్య మాత్రం విజయకేతనం ఎగరేశాడు. అయితే వైసీపీ అధ్యక్షుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయనకు వీరాభిమాని అని, దానికి ప్రూఫ్ ఇదే అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి పోతే..

     జగన్ ముఖ్యమంత్రి.. బాలయ్య ఎమ్మెల్యే

    జగన్ ముఖ్యమంత్రి.. బాలయ్య ఎమ్మెల్యే

    వైసీపీ తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయగా.. టీడీపీ తరఫున హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఎప్పుడైతే ఈ ఇద్దరూ అధికారం చేపట్టారో.. అప్పటి నుంచే వీరిద్దరికి సంబంధించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. వైఎస్ జగన్.. బాలకృష్ణ వీరాభిమాని అనేది అందులో సారాంశం.

    ఇదిగో సాక్ష్యం అంటూ పేపర్ కటింగ్

    ఇదిగో సాక్ష్యం అంటూ పేపర్ కటింగ్

    ఇన్నాళ్లు వైరల్ అవుతున్న ఈ వార్తలకు కొనసాగింపుగా ఇదిగో సాక్ష్యం అంటూ పేపర్ కటింగ్ ఒకటి సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. అది 2000 సంవత్సరానికి చెందిన ఓపేపర్ కటింగ్. అప్పట్లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ 'సమరసింహారెడ్డి' ప్రకటన అది. అయితే ఇందులో బాలకృష్ణకు అభినందనలు తెలుపుతూ వైఎస్ జగన్ దర్శనమిస్తుండటం జనాన్ని ఆశ్చర్య పరుస్తోంది.

    కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం ప్రెసిడెంట్ జగన్

    కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం ప్రెసిడెంట్ జగన్

    కాగా ఈ పేపర్ యాడ్ ఇచ్చింది సాక్షాత్తు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్‌మోహన్ రెడ్డి అని స్పష్టమవుతోంది. '2000 నూతన సంవత్సర శుభాకాంక్షలతో వై.యస్.జగన్మోహన్ రెడ్డి, ప్రెసిడెంట్, కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం' అని ఈ ప్రకటనలో కనిపిస్తుండటమే ఇందుకు ఆధారం. 'సమరసింహారెడ్డి' సినిమా 365 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడి హోదాలో జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పినట్లుగా ఈ పేపర్ కటింగ్ నిరూపిస్తోంది.

    ముదిరిన వాదనలు

    ముదిరిన వాదనలు

    అయితే ఈ పేపర్ కటింగ్ చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అసలు జగన్ బాలయ్య అభిమాని కాదని కొందరు బలంగా వాదిస్తున్నారు. సమరసింహారెడ్డి సినిమా 1999లో విడుదలైంది. కడపలో ఈ సినిమా ఒకే థియేటర్లో 365 రోజులు ఆడింది. ఈ సందర్భంగా 2000 సంవత్సరంలో కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడు పేపర్ యాడ్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ.. అభిమాన సంఘం అధ్యక్షుడు జగన్ అని పేర్కొనడం తప్పు, అది మార్ఫింగ్ ఇమేజ్ అనే వాదనలు వినిపిస్తున్నాయి.

    English summary
    Back in the days, the then Congress party leader YS Rajasekhar Reddy's son YS Jagan used to be a huge fan of movie actor Nandamuri Balakrishna. When films of this action star are releasing, Jagan, the then President of Kadapa District Balayya Fans Association
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X