చిరంజీవికి జగన్ సపోర్ట్ దొరికింది.. ఇక మామూలుగా ఉండదు వ్యవహారం!
సినీ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సపోర్ట్ దొరికింది. సపోర్ట్ అన్నాం కదా అని ఇదేదో పొలిటికల్ సపోర్ట్ అనుకోకండి.. అది సినిమా సపోర్ట్. అదేనండీ! ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 'సైరా' ఫీవర్ గమనించి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకలోకానికి తీపి కబురు అందించారు వైఎస్ జగన్. దీంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ జగన్ అందించిన ఆ తీపి కబురేంటి? మెగా ఫ్యాన్స్‌లో ఎందుకంత సంబరం? ఆ వివరాలు చూద్దామా..

సైరా అనుమతి కోసం దర్శకనిర్మాతలు
రాష్ట్ర వ్యాప్తంగా సైరా నరసింహా రెడ్డి సినిమాకు ఉన్న డిమాండ్ దృష్ట్యా మా సినిమాకు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని జగన్ ప్రభుత్వాన్ని కోరారు సైరా దర్శకనిర్మాతలు. ఏపీలో 6 షోలకు అనుమతి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. అయితే ఈ అభ్యర్థనపై జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సైరా సినిమాకు ఫేవర్‌గా కీలక నిర్ణయం తీసుకుంది.

అంతవరకూ ఓకే కానీ.. ఇది సాధ్యం కాదు
ఏపీలో అన్నిచోట్లా సైరాపై అంచనాలు భారీగా ఉండటంతో సైరా థియేటర్స్ వద్ద వారం ముందు నుంచే హంగామా మొదలైంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఒక్క రోజులో 6 షోలు వేసుకోవడానికి ప్రత్యేక పర్మిషన్ ఇచ్చేసింది. అయితే టికెట్ ధరల పెంపుకు మాత్రం ఏపీ గవర్నమెంట్ అనుమతులు ఇవ్వకపోవడం గమనార్హం. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు సైరా డిస్ట్రిబ్యూటర్స్.

ఇక మామూలుగా ఉండదు వ్యవహారం!
మరోవైపు సైరా సినిమాకు ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ ద్వారా వచ్చిన టాక్ చూస్తుంటే.. ఇక ఆ సంచలనాలు ఊహించలేం అనిపిస్తోంది. పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు షోలకు అనుమతి దొరకడంతో సైరా వ్యవహారం మామూలుగా ఉండదని పేర్కొంటున్నారు సినీ విశ్లేషకులు. ఏది ఏమైనా సైరా సినిమాకు, చిరంజీవికి జగన్ ఇచ్చిన సపోర్ట్ పట్ల ఖుషీ అవుతున్నారు ఏపీ జనం.

రోమాలు నిక్కబొడిచేలా ఉరికంబం సీన్
ఇప్పటికే సైరా చూసిన ప్రేక్షకులు చిత్రంలోని ప్రతీ సన్నివేశం కూడా రోమాలు నిక్కబొడిచేలా ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతీ సీన్ ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తుందట. ఇక చివరగా సైరా నర్సింహారెడ్డి ఉరికంబం ఎక్కే సీన్ ఆడియన్స్‌ని ఎమోషనల్ చేసేస్తుందట. చివరి పది నిమిషాల సినిమా హై వోల్జేజ్‌గా ఉంటుందని తెలిసింది.

'సైరా నరసింహా రెడ్డి' మూవీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











