వైవీఎస్‌ చౌదరి 'రేయ్‌' ఎంతవరకు వచ్చింది?

By Srikanya

హైదరాబాద్: వైవీఎస్‌ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రేయ్‌'. చిరంజీవి మేనల్లుడు సాయిధర్మ్‌ తేజ్‌ హీరో. సయామీ ఖేర్‌ హీరోయిన్. శ్రద్ధాదాస్‌ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో హీరో, హీరోయిన్స్ పై 'డ్యాన్స్‌ ఇన్‌ ద స్కై' పాటను తెరకెక్కించారు. చంద్రబోస్‌ రచించిన ఈ గీతానికి బృంద నృత్యరీతులు సమకూర్చారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''ఈ పాట కోసం ఫిల్మ్‌సిటీలో రూ.కోటితో భారీ సెట్‌ నిర్మించాం. విశ్రాంతికి ముందొచ్చే గీతమిది. 'సీతయ్య'లో 'ఒక్కమగాడు' పాటకు ఎంత స్పందన వచ్చిందో ఈ పాటకూ అంతే గుర్తింపు దక్కుతుందనే నమ్మకం ఉంది. మేలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.

కథ గురించి చెపుతూ.... ఆ కుర్రాడికి తెలిసింది ఒక్కటే.. డ్యాన్స్‌. ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తాడు. నాట్యం అంటే అతనికి ప్రాణం. డ్యాన్స్‌లో తనకున్న ప్రావీణ్యం నిరూపించుకొనే ఓ అవకాశం వచ్చింది. అందులో గెలిస్తే... అంతర్జాతీయంగా అతని పేరు మార్మోగుతుంది. ఆ అవకాశాన్ని వదులుకోలేదు. 'డ్యాన్స్‌ ఇన్‌ ద స్కై, డ్యాన్స్‌ ఇన్‌ ద ఫ్లోర్‌..' అంటూ పాదం లయబద్ధంగా కదిపాడు. మరి ఆ పోటీలో గెలిచాడా? లేదా? తెలియాలంటే మా సినిమా చూడండి అన్నారు చౌదరి. సంగీతం: చక్రి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X