లెజెండ్రీ రచయిత్రి ఇక లేరు.. అమెరికాలో యద్దనపూడి సులోచన కన్నుమూత, మరపురాని చిత్రాలు!

Recommended Video

రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మరణం

మహిళా రచయితల్లో యద్దనపూడి సులోచనారాణిని(79) లెజెండ్ గా అభివర్ణించవచ్చు. అమెరికాలో నివాసం ఉంటున్న ఆమె కాలిఫోర్నియాలో మృతి చెందారు. గుండెపోటు రావడంతో సులోచనారాణి మృతిచెందినట్లు ఆమె కుటుంబ వర్గాలు ధృవీకరించాయి. నవలా రచయితగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఆమె మృతి చెందడంతో ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఎమెస్కో పబ్లిషర్ విజయ్ కుమార్ సులోచన దేవి అత్యధిక నవలలని ప్రచురించారు. సులోచన దేవి మృతి చెందిన విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు తనకు ఫోన్ చేసిన చెప్పినట్లు విజయ్ కుమార్ తెలిపారు.

కుటుంబ నేపథ్యం

కుటుంబ నేపథ్యం

యద్దనపూడి సులోచనారాణి కృష్ణా జిల్లాలోని మొవ్వ మండలం కాజా గ్రామంలో 1940లో జన్మించారు. కుటుంబ బంధాలు అద్భుతంగా ఆవిష్కరించే నవలా రచయిత్రిగా 'నవలా దేశపు రాణి'గా ఆమె కీర్త పొందారు.

సినీ పరిశ్రమలో సంచలనం

సినీ పరిశ్రమలో సంచలనం

సులోచనారాణి నవలలు వెండి తెరని కూడా ఓ కుదుపు కుదిపేశాయి. ఆమె రాసిన అనేక నవలలు సినిమాలుగా, టివి సీరియల్స్ గా అలరించాయి. అగ్నిపూలు, ఆహుతి, అమర హృదయం, రుతువులు నవ్వాయి, కలల కౌగిలి, ప్రేమ పీఠం, బహుమతి, బంగారు కలలు, మౌనతరంగాలు, మీనా వంటి నవలలు వెండి తెరపై మెరుపులు మెరిపించాయి.

'మీనా' తిరుగులేని ఖ్యాతి

'మీనా' తిరుగులేని ఖ్యాతి

1973 లో విజయనిర్మల, కృష్ణ నటించిన మీనా చిత్ర కథ సులోచనారాణి మీనా నవలనుంచి తీసుకున్నారు. మీనా నవల అత్యంత ప్రజాదరణ పొందింది. మీనా చిత్రం కూడా మంచి విజయం సాధించింది. 2016 లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకేకించిన అ.. ఆ చిత్రానికి కూడా మీనా నవలే ఆధారం.

ప్రేమ కథలే

ప్రేమ కథలే

సులోచనా రాణి నవలల్లో ఎక్కువభాగం ప్రేమకథలే ఉంటాయి. మధ్యతరగతి మహిళ మనసులని ఆమె అద్భుతంగా తన రచనలద్వారా తెలియజేసారు. ధనవంతుడైన యువకుడు, మధ్యతరగతి అమ్మాయి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో సులోచనా రాణి ఎక్కువ నవలలు రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X