రవికుమార్ చౌదరి తో 'ఈతరం'....

అయితే ఈ సినిమాలో హీరో గోపీచంద్ కాదు. 'యజ్ఞం' నుంచి వరుసగా అతనితోటే సినిమాలు తీస్తూ వచ్చిన బాబూరావు ఈసారి తన బానర్‌లో ఇంతదాకా నటించని యువ హీరోతో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆ హీరోకు కథ వినిపించారనీ, అతనికి బాగా నచ్చిందనీ తెలుస్తోంది. నిజానికి ఈ తరం ఫిలిమ్స్ ఒకప్పుడు అభ్యుదయ చిత్రాలు,ఆలోచింపచేసే విధంగా తీసేవారు. కానీ తరం మారగానే ఈ తరం కూడా తమ బాటను వీడి 'రణం', 'ఒంటరి' వంటి ఫక్తు మాస్ మసాలా సినిమాలు తీస్తూ ముందుకెళ్తోంది. ఆ కోవలోనే కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











