సినీ పీల్డుని అక్కడకి మారిస్తేనే బెస్ట్
తెలుగు సినీపరిశ్రమ మద్రా సు తరలి పోతుందని ముఖ్యమంత్రి రోశయ్య ఆవేదన చెందే బదులు విజయవాడ-గుంటూరుల మధ్యకు తరలించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ సూచించారు. అక్కడ అవసరమైన మౌలిక వసతులను, సదుపాయాలను కల్పించాలని సూచించారు. తెలుగు చిత్ర పరిశ్రమ తెలుగు నేలలో నెలకొనడానికి శ్రీకారం చుట్టి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని శివాజీ ఆ ప్రకటనలో తెలిపారు.
అలాగే సినిమాల నిర్మాణం మద్రాసులో జరిగే రోజుల్లోనే విజయవాడ కీలక స్థానంగా ఉందని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిర్మాత, దర్శకులు, రచయితలు, నటీనటులు, సంగీత దర్శకులు, నిర్మాణ సంస్థలు, పంపిణీదారులు, వాల్‌పోస్టర్ల ముద్రణ వంటి అన్ని రకాల కార్యక్రమాలు అప్పట్లో విజయ వాడ కేంద్రంగా సాగేవని ఆయన గుర్తు చేశారు.
More from Filmibeat
తెలంగాణ సమైఖ్యాంద్ర గుంటూరు రోశయ్య శివాజి విజయవాడ చెన్నై హైదరాబాద్ చిరంజీవి మోహన్ బాబు telangana rosaiah sivaji vijayawada chennai hyderabad chiranjeevi


Click it and Unblock the Notifications











