సినీ పరిశ్రమకు దాసరి ఓ పెద్ద దరిద్రం: నిర్మాత యలమంచిలి
దర్శకరత్న దాసరి నారాయణరావుపై నిర్మాత యలమంచిలి రవిచంద్ర సోమవారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. చిత్ర పరిశ్రమకు దాసరి నారాయణరావు ఓ పెద్ద దరిద్రం అని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెద్ద నిర్మాతలు నిర్ణయాలు సొంతగా తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. చిన్న నిర్మాతలను సంప్రతించకుండానే వారు నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. టిక్కెట్ల ధరల విషయంలో కూడా వారు సొంతగా నిర్ణయాలు తీసుకొని చిన్న నిర్మాతలను విస్మరిస్తున్నారని ఆరోపించారు.
కాగా, గత 18 రోజుల పాటు సినీ కార్మికులు తమ వేతనంలో 32 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేశారు. వారి డిమాండ్‌కు నిర్మాతల మండలి అంగీకరించడంతో వారు సమ్మెను విరమించారు. రేపటి నుంచి షూటింగులు ప్రారంభమవుతున్నాయి. సినీ కార్మికులకు, నిర్మాతలకు మధ్య చెలరేగిన వివాదంలో దాసరి నారాయణ రావు కార్మికులకు మద్దతుగా నిలిచారు.


Click it and Unblock the Notifications











