చెప్పకుండా యమదొంగను తీసేస్తారా?
చిత్తూరు టౌన్ లో యమదొంగ అభిమానులు శనివారం ధర్నాకు దిగారు. ఈ ధర్నా ఇన్నాళ్లు యమదొంగ సినిమాను ప్రదర్శించిన గురునాథ్ థియేటర్ ముందు జరిగింది. విషయం ఏమంటే యమదొంగ సినిమాను మేనేజ్ మెంట్ తీసివేయడమే కారణం. అదీ కూడా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానట. రోజుకు రూ.7500 వచ్చినన్నాళ్లు సినిమాను నడిపించాలనేది ఒప్పందం కాగా ఇదేమీ పట్టించుకోకుండా థియేటర్ యాజమాన్యం ప్రవర్తించిందని అభిమానులు నిరసన తెలిపారు. గత రెండు రోజులుగా కలెక్షన్స్ పడిపోవడం మూలంగానే సినిమాను మార్చామని థియేటర్ యాజమాన్యం తెలిపింది.


Click it and Unblock the Notifications











