శ్రీహరి ‘యమహో యమ’ మంత్రాలయంలో..
శ్రీహరి ప్రధాన పాత్రలో సాయిరాం శంకర్, పార్వతి మెల్టన్ జంటగా రూపొందుతున్న చిత్రం యమహో యమ. జితేందర్. వై దర్వకత్వలో జి.వి.కె ఆర్ట్స్ పతాకంపై జి.విజయ్ కుమార్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విశేషాల గురించి దర్శకుడు వివరిస్తూ...ఇది ఫక్తు సోషియో ఫాంటసీ సినిమా. యుముడు, చిత్ర గుప్తుడు నేపథ్యంలో కథ సాగుతుంది. వారిద్దరి పాత్రలు, అమెరికాలో సందడి.. సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది అని అన్నారు. నిర్మాత జి. విజయ్ కుమార్ గౌడ్ చిత్రం విశేషాలను వివరిస్తూ...యమధర్మరాజుగా శ్రీహరి గెటప్ అద్భుతంగా వచ్చిందన్నారు.
ఈ నెల 20 నుంచి 22 వరకు సాయిరాం శంకర్, డాన్సర్లు, వంద మంది జూనియర్ ఆర్టిస్టులపై రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పాట తీశాం..'తెలుగులో నమస్తే..తమిళ్ లో వణక్కం..ఉర్దూమే ఆదాబర్సే" అంటూ చిర్రావూరి విజయ్ కుమార్ రాసిన పాటకు ప్రేమ్ రక్షిత్ నృత్యరీతుల్ని సమకూర్చారు. ఈ నెల 28 నుండి కర్నూలు, ఆదోని, మంత్రాలయంలో షెడ్యూలు చేస్తాం. పది రోజుల ఈ షెడ్యూల్ లో శ్రీహరి, సాయిరాం శంకర్, పార్వతి మెల్టన్, కోవై సరళ, మాస్టర్ భరత్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఆ తర్వాత అమెరికాలో భారీ షెడ్యూల్ చేస్తామని వెల్లడించారు. ఈ చిత్రానికి రచన : వెలిగొండ శ్రీనివాస్, సంగీతం : మహతి, కెమెరా : ప్యాట్రిక్, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ : వి.ఎస్.మణి, లైన్ ప్రొడ్యూసర్స్ : అమీషా ఎంటర్ టైన్ మెంట్స్.


Click it and Unblock the Notifications











