పూరి తమ్ముడి ‘యమహో యమ’ హాలీవుడ్లో..
పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా 'యమహో యమ' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. పార్వతి మెల్టన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రానికి జితేందర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ అమెరికాలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 'తెలుగు తెరపై యముడి నేపథ్యం సక్సెస్‌ఫుల్ ఫార్ములా. తెలుగులో గతంలో వచ్చిన యముడి చిత్రాల కంటే ఈ చిత్రం ఎంతో విభిన్నంగా వుంటుంది. యమధర్మరాజుగా శ్రీహరి, ఆయనకు జతగా చిత్రగుప్తుని పాత్రలో ఎమ్మెస్ నారాయణ ప్రేక్షకుల్ని అలరిస్తారు' అన్నారు. నిర్మాత మాట్లాడుతూ 'అమెరికాలో నెల రోజుల పాటు చిత్రీకరణ జరుపుతాం. లాస్ ఏంజిల్స్, ఫ్లోరిడా, మియామి బీచ్, న్యూయార్క్ తదితర ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుతాం. హాలీవుడ్‌లో కూడా యుమునికి సంబంధించిన కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తాం. హీరోహీరోయిన్లపై మూడు పాటలు, యముడిపై ఓ ఐటమ్‌సాంగ్‌ను ఇక్కడ చిత్రీకరించనున్నాం' అని తెలిపారు. జివికె ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రానికి రచన : వెలిగొండ శ్రీనివాస్, సంగీతం : మహతి, కెమెరా : ప్యాట్రిక్, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ : వి.ఎస్.మణి, లైన్ ప్రొడ్యూసర్స్ : అమీషా ఎంటర్ టైన్ మెంట్స్.


Click it and Unblock the Notifications











