సాయిరామ్ శంకర్ ‘యమహోయమః’విడుదల తేదీ ఖరారు
సాయిరామ్‌శంకర్, పార్వతి మెల్టన్ హీరో, హీరోయిన్లుగా జీవీకే ఆర్ట్స్ పతాకంపై జి.విజయ్‌కుమార్‌గౌడ్ నిర్మిస్తున్న 'యమహోయమః' చిత్రం మే 11 న విడుదల అవుతోంది. ఈ విషయాన్ని నిర్మాతలు ఖరారు చేస్తూ మీడియోతో మాట్లాడారు. దర్శకుడు వై జితేందర్ మాట్లాడుతూ...''తెలుగులో యమ కథాంశంతో వచ్చిన సినిమాలన్నీ ఘనవిజయం సాధించాయి. మేం చేస్తున్న ఈ 'యమహోయమః' రొటీన్ కథాంశం కాదు. ఓ ప్రత్యేక కార్యం నిమిత్తం యముడు, చిత్రగుప్తుడు అమెరికా వెళ్తారు. అక్కడ వారు చేసే సందడి వినోదాత్మకంగా ఉంటుంది. ఇది సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే కమర్షియల్ ఎంటర్‌టైనర్. యమునిగా శ్రీహరి గెటప్ అద్భుతంగా వచ్చింది'' అని చెప్పారు.
నిర్మాత
శ్రీహరి యమధర్మరాజుగా రూపొందుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత జి.విజయ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ -''ఈ నెల 30న రాయలసీమలో మూడో షెడ్యూల్ ఆరంభిస్తాం. కర్నూలు జిల్లా ఆదోని, పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. అనంతరం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో యమపురికి సంబంధించి సన్నివేశాలు తీస్తాం. మార్చి నుంచి అమెరికాలో భారీ షెడ్యూలు చేస్తాం. ఏప్రిల్ రెండోవారంలో ఆడియోను, మే 11న సినిమాను విడుదల చేస్తాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి రచన: వెలిగొండ శ్రీనివాస్, సంగీతం: మహతి, ఆర్ట్: వి.ఎన్.మణి, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, లైన్ ప్రొడ్యూసర్: అమీషా ఎంటర్‌టైన్‌మెంట్స్.


Click it and Unblock the Notifications











