యూనివర్సల్ స్టూడియోలో 'యమహో యమః
ఈ సందర్భంగా హీరో సాయిరామ్‌శంకర్ మాట్లాడుతూ-''ప్రచారంలో తొలిఅడుగుగా బేబీ స్ఫూర్తి పాడిన ఐటమ్‌సాంగ్‌ను యూ ట్యూబ్ ద్వారా విడుదల చేస్తున్నాం. మహతి ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా బాగా వస్తోంది'' అని చెప్పారు. శ్రీహరి మాట్లాడుతూ ''నా సినిమాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర లభించింది. యముడిగా నటించడం ఓ కొత్త అనుభూతి'' అన్నారు.
ఆ చిత్రంలో సాయిరామ్ క్యారెక్టర్ గురించి దర్శకుడు జితేందర్.వై మాట్లాడుతూ...పొద్దున లేవగానే రామా.. కృష్ణా... అని తలచుకొనే భక్తుల్ని చూశాం. శివుడికీ, శ్రీ వెంకటేశ్వరస్వామికీ దండం పెట్టుకొనేవాళ్లనీ చూస్తుంటాం. కానీ ఓ యువకుడు మాత్రం నిత్యం యమనామ జపం చేస్తుంటాడు. యమధర్మరాజుకి అపరభక్తుడిగా మారిన ఆ యువకుడి కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు. అలాగే ...ఒక యమభక్తుడు సృష్టించే సందడితో ఆద్యంతం సరదాగా సాగే చిత్రమిది. యమధర్మరాజు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే విషయాన్ని తెరపైనే చూడాలి. వినోదం, భావోద్వేగాల మేళవింపుతో కథ సాగుతుంది. యమధర్మరాజుగా శ్రీహరి నటన ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు.
ఈ చిత్రానికి రచన: వెలిగొండ శ్రీనివాస్, కెమెరా: ఆర్.జనార్థన్, కొరియోగ్రఫి: ప్రేమ్ రక్షిత్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: సాయి, నిర్మాత: జి.విజయ్‌కుమార్ గౌడ్, లైన్ ప్రొడ్యూసర్స్: అమీషా ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాణం: జి.వి.కె. ఆర్ట్స్.


Click it and Unblock the Notifications












