For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీహరి ప్రధాన పాత్రలో ప్రారంభమైన 'యమహో యమః'

    By Sindhu
    |

    డా. శ్రీహరి ,సాయిరాం శంకర్ ల కాంబినేషన్లో వై జితేందర్ దర్శకత్వంలో జి వి కె ఆర్ట్స్ పతాకంపై జి విజయ్ కుమార్ గౌడ్ నిర్మాతగా రూపుదిద్దుకోబోతున్న నూతన చిత్రం 'యమహో యమః '. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం అన్నపూర్ణా స్టూడియోలో జరిగింది. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన బెల్లంకొండ సురేష్ ముహూర్తపు దృశ్యానికి స్విచ్ ఆన్ చేయగా, అచ్చిరెడ్డి క్లాప్ నిచ్చారు.ఈ సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాద్ గౌరవ దర్శకత్వం వహించారు.

    ఈ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డా. శ్రీహరి మాట్లాడుతూ గతంలో మహామహులు నటించిన యముడు పాత్రను నేను ఇప్పుడు చేయబోతున్నాను.వారికి సరిసమానంగా నటించడానికి ప్రయత్నం చేస్తాను అని తెలిపారు. సాయిరాం శంకర్ మాట్లాడుతూ ఈ చిత్రం లో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు నిర్మత కు చాలా తాంక్స్.అలాగే ఈ చిత్రాన్ని అమెరికాలో ప్లాన్ చేసారు.అమెరికాకు వెళ్లిన ఓ యువకుడుకి,యముడు కీ మధ్య జరిగే సన్నివేశాలు ఈ చిత్రంలో అలరించనున్నాయి. అమెరికాలో ఈ నెల 20 వ తేదీనుండీ చిత్రం చిత్రీకరణ ప్రారంబమవుతుందని నిర్మాత విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సినిమాలోని ప్రధాన తారాగణంతో పాటుగా మిగిలిన పాత్రల్లో అలీ, పార్వతీ మిల్టన్,భరత్, కోవై సరళ మొదలైన వారు నటిస్తున్నారు.అలాగే ఈ చిత్రానికి సంగీతం మహతీ, పాటలు చంద్రబోస్, భాస్కరభట్ల,అందిస్తున్నారు.

    English summary
    Dr Srihari, Sairam Shankar starrer ‘Yamaho Yama’ was launched today at Annapurna Studios in Hyderabad. Jitender Y is directing the film and G Vijaykumar Gaud is producing it under GVK Arts banner. Bellamkonda Suresh switched on the camera for the muhurat shot while K Atchi Reddy tapped the clap board and Puri Jagannath directed the first shot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X