‘యమలీల-2’ ఆడియో రిలీజ్... (ఫోటోస్)
హైదరాబాద్: సతీష్, దియా నికోసల్ హీరో హీరోయిన్లుగా, యముడిగా మోహన్ బాబు నటించిన చిత్రం ‘యమలీల-2'. ఎస్.వి.కృష్ణా రెడ్డి దర్శకత్వంలో కె.అచ్చిరెడ్డి ఆశీస్సులతో క్రిష్వీ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ఆడియో వేడుక శిల్పకళావేదికలో ఆదివారం జరిగింది. నటించారు.
హీరో శ్రీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియో ఆవిష్కరించారు. ఈసందర్భంగా దర్శకుడు యస్వీ.కృష్ణా రెడ్డి మాట్లాడుతూ ''నేనెప్పుడూ నా సంస్కారం వదిలి సినిమాలు చేయను. ఇది ఓ వ్యక్తికి బాగా నచ్చింది. అతనే సతీష్. అందుకే నన్ను దర్శకుడిగా ఎన్నుకున్నాడు. సినిమా మంచి స్టాండర్డ్ తో చేయాలని, ఏ హీరోకి తగ్గని విధంగా చేయాలని అన్నాను. అందుకు సతీష్ ఒకే అన్నారు. మంచి సినిమాలు తీయాలనే ఆశయంతో క్రిష్వి సినిమా సంస్థను ప్రారంభించారు ఆయన. సినిమా అందరికీ నచ్చే విధంగా వినోదాత్మకంగా ఉంటుంది' అన్నారు.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు ఫోటోలు...

శ్రీకాంత్ మాట్లాడుతూ
'నన్ను ఫ్యామిలీ హీరోని చేసింది కృష్ణారెడ్డిగారు, ఇ.వి.వి గారు. చాలా రోజులు తర్వాత కృష్ణారెడ్డి గారి సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభమయ్యింది. నాకు మళ్లీ ఆయన దర్శకత్వంలో చేసే అవకాశం వస్తుంది. సతీష్ కి సినిమా రంగంలో మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను' అన్నారు.

హీరో సతీష్ మాట్లాడుతూ
''సినిమా అంటే నాకు మక్కువ. నటన అనేది నా కెరీర్ కాదు. కానీ, సినిమా అంటే ఆసక్తి ఉండటంతో యాక్ట్ చేస్తున్నాను. చిన్నప్పటి నుండి ఎస్వీకృష్ణారెడ్డి అభిమానిని. చాలా గ్యాప్ తర్వాత ఆయన సినిమా చేయడం, అందులో నేను నటించడం ఆనందంగా ఉంది.

ఆ నలుగురే ఈ సినిమా హీరోలు...
ఆ నలుగురే ఈ సినిమా హీరోలు... ఈ సినిమాకి నలుగురు హీరోలు ఉన్నారు. వాళ్లే మోహన్ బాబు, బ్రహ్మానందం, యస్వీ.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి. వారి సహకారంతో ఎలాంటి టెన్షన్ లేకుండా నేను ఈ సినిమా చేసానని హీరో సతీష్ తెలిపారు.

సదా మాట్లాడుతూ..
''ఇందులో నాకు దేవత క్యారెక్టర్ ఇచ్చారు యస్వీ.కృష్ణారెడ్డి గారు. నా మీద చిత్రీకరించిన పాట అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాకి నన్ను తీసుకున్నందుకు కృష్ణారెడ్డిగారికి ధన్యవాదాలు అన్నారు.

నటీనటులు
కోటా శ్రీనివాసరావు, ఎం.ఎస్.నారాయణ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, సదా, నిషా కొఠారి, షయాజీ షిండే, ఉత్తేజ్ తదితరులు నటిస్తున్నారు.

టెక్నీషియన్స్
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : శ్రీకాంత్ నారోజ్, ఎడిటర్ : గౌతంరాజు, మాటలు: గంగోత్రి విశ్వనాధ్, భవానీ ప్రసాద్, పి.ఆర్.ఒ : బి.ఎ.రాజు, ఆర్ట్: చిన్నా, సి.జి : మకుట, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎం.ఎ.జగన్నాధ్ రెడ్డి, కథ, స్ర్కీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం : ఎస్.వి.కృష్ణా రెడ్డి.


Click it and Unblock the Notifications











