'యమలోకంలో.. జై తెలంగాణ' మొదలైంది
తెలంగాణ ఉద్యమంలో కళాకారుడిగా తనవంతు పాత్ర పోషించానని,శక్తివంతమైన సినిమా మాధ్యమం ద్వారా ఇక ఉద్యమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకు పోతానంటూ రసమయి బాలకిషన్ చెప్పారు. ఆయన దర్శక, నిర్మాణంలో 'యమలోకంలో..జై తెలంగాణ' సినిమా షూటింగ్ నల్లగొండ జిల్లా భువనగిరిలో ప్రారంభమైంది. స్థానిక గ్రీన్‌లాండ్ హోటల్‌లో ఏర్పాటు చేసిన యమలోకం సెట్‌లో జే ఏసీ చైర్మన్ కోదండరాం, ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్, సురేష్ కుమార్, సినీ గేయ రచయిత అందెశ్రీ, జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రొఫెసర్ కోదండరాం క్లాప్ కొట్టగా, దర్శకుడు ఎన్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. మరో దర్శకుడు నాగబాల సురేశ్ కుమార్ తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రొ.కోదండరాం మాట్లాడుతూ సినిమారంగంలో ఆంధ్ర పెట్టుబడిదారుల గుత్తాధిపత్యం ఉందన్నారు. ఉద్యమానికి ఊతం ఇచ్చే విధంగా రసమయి ధైర్యం చేసి సినిమా తీయడం అభినందనీయమన్నారు.ఇక గతంలో భద్రాచలం, జయం మనదేరా, ఎనకౌంటర్, రామ్ వంటి చిత్రాలను డైరక్ట్ చేసిన ఎన్ శంకర్ కూడా తెలంగాణాలో ఓ చిత్రం చేయటానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











