శ్రీకృష్ణ కమిటికి జవాబుగా తెలంగాణా సినిమా

By Srikanya

తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈ చిత్రం ఒక నిఘంటువు. 53 ఏళ్లలో తెలంగాణలో జరిగిన అనేక దోపిడిలకు కారకులను ఈ చిత్రంలో చూపించడంతో పాటు శ్రీకృష్ణ కమిటికి ఓ జవాబుగా కూడా పనిచేస్తుంది' అంటున్నారు 'రసమయి' బాలకిషన్. ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'యమలోకంలో తెలంగాణ' చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. ఈ చిత్రం గురించి బాలకిషన్ మాట్లాడుతూ' వీరులకు ఎప్పుడూ మరణం ఉండదు. వారు ప్రజల గుండెల్లో ఎప్పుడూ చిరంజీవులే అన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమాన్ని, ఉద్యమిస్తున్న తెలంగాణా విద్యార్ధులకు స్పూర్తినిచ్చేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు. ఇక ఈ చిత్రం కథ గురించి చెబుతూ...అమరులైన ఎంతో మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలు చివరకు యమపురిని తాకి యమధర్మరాజుతో కూడా కన్నీరు పెట్టిస్తాయి. వలసవాదుల ఆగడాలకు బలయి తెలంగాణ బిడ్డలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవలసి వచ్చిందో ఈ సినిమాలో చూపిస్తున్నాం అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X