twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు శిరీష్‌ కి జోడీగా ఆమెనే ఖరారు

    By Srikanya
    |

    అల్లు అర్జున్‌ సోదరుడు అల్లు శిరీష్‌ హీరోగా త్వరలో 'గౌరవం'అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన యామి గౌతమ్‌ హీరోయిన్ గా ఎంపికైంది. తెలుగులో రవిబాబు దర్శకత్వంలో నువ్విలా చిత్రంలో హీరోయిన్ గా చేసిన ఈమె ఇటీవలే హిందీలో విడుదలై ఘన విజయం సాధించిన 'విక్కీ డోనర్'లోనూ హీరోయిన్ గా చేసి అందరి దృష్టిలో పడింది. ఈ చిత్రం షూటింగ్ జూన్ 18న మైసూర్‌లో మొదలుకానుంది.

    తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రానికి రాధామోహన్‌ దర్శకత్వం వహిస్తారు. 'ఆకాశమంత', 'గగనం' చిత్రాలు రూపొందించింది ఆయనే. నటుడు ప్రకాష్‌ రాజ్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు. గౌరవం చిత్రాన్ని మొదట నాగచైతన్యతో అనకున్నారు. కథ ఓకే చేసి ఫోటో షూట్ లు సైతం జరిగాయి. కానీ చివరి నిముషంలో ప్రాజెక్టు ఇలా అల్లు శిరీష్ కి చేరింది. బడ్జెట్ బాగా ఎక్కువ అవుతూండటంతో వర్కవుట్ కాదని దాన్ని నాగార్జున రిజెక్టు చేసినట్లు సమాచారం.

    ఈ చిత్రం కోసం అల్లు శిరీష్ ఏక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం.అందుకోసమే డైలాగు డిక్షన్, యాక్టింగ్ ఎబిలిటీస్ కోసం శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయాలని పూర్తి ఎఫెర్ట్ పెడుతున్నారు. భారీగా ఆ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

    ఈ చిత్రం విశేషాలను ప్రకాశ్‌ రాజ్ తెలియజేస్తూ -''డ్యూయట్ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు నిర్మిచిన మా సంస్థలో ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం అవుతుంది. దక్షిణాదిలో అతిపెద్ద సినీ కుటుంబానికి చెందిన శిరీష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది'' అన్నారు. ప్రకాశ్‌రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.

    English summary
    Yami Gautam, who had earlier acted in Ravi Babu’s Nuvvila, is going to team up with Allu Sirish in Gouravam film. Her recent Hindi film Vicky Donor was a huge hit and that seems to be one of the reasons why she was finalized. Prakash Raj is going to produce the film on Duet Movies banner. The principal shooting of this film will begin from June 18 in Mysore. Prakash Raj, Nazar and LB Sriram are also playing important roles in the film. S S Thaman is composing the music and Preetha is the cinematographer. The film will be simultaneously shot in Telugu and Tamil.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X