శిరీష్ ‘గౌరవం’ షూటింగులో యాక్సిడెంట్, హీరోయిన్‌కి గాయాలు
హైదరాబాద్: అల్లు శిరీష్-యామి గౌతమి హీరో హీరోయిన్లుగా రాధా మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'గౌరవం' చిత్రం షూటింగులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో హీరోయిన్ యామి గౌతమికి గాయాలయ్యాయి. బైక్‍పై సాంగ్ చిత్రీకరిస్తుండగా ప్రమాద వశాత్తు ఈ ఘటన చోటు చేసుకుంది.
అయితే ఇది ఆందోళన పడాల్సి విషయమేమీ కాదని, చిన్నపాటి గాయమేన అని వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటనపై యామి స్పందిస్తూ....'బైక్‌పై వెళ్లే పాట చిత్రీకరణ జరుపుతుండగా చిన్న యాక్సిడెంట్ జరిగింది. నా అదృష్టం కొద్దీ డాక్టర్ అందుబాటులో ఉన్నాడు. యూనిట్ సభ్యులు నాకు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు' అని చెప్పుకొచ్చింది.
28 ఏళ్ల యామి గౌతమి హిందీలో వచ్చిన 'వికీ డోనర్' చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'నువ్విలా' చిత్రంలో నటించింది. ప్రస్తుతం అల్లు శిరీష్‌కి జంటగా 'గౌరవం' చిత్రం ద్వారా అటు తమిళంలోనూ అడుగు పెడుతోంది.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే 'గౌరవం' చిత్రానికి రాధామోహన్ దర్శకత్వం వహిస్తారు. 'ఆకాశమంత', 'గగనం' చిత్రాలు రూపొందించింది ఆయనే. నటుడు ప్రకాష్ రాజ్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 50% పూర్తయింది. ప్రకాశ్‌రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.


Click it and Unblock the Notifications











