తెరపైకి 'యామిని కృష్ణమూర్తి' జీవిత కథ.. టాలీవుడ్‌లో మరో బయోపిక్!
తెలుగులో 'దివ్యమణి' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన గిరిధర్ గోపాల్, తన తదుపరి చిత్రంగా ప్రముఖ నాట్యమణి పద్మశ్రీ యామిని కృష్ణమూర్తి జీవిత కథను ఆధారంగా చేసుకొని బయోపిక్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..
ఈ సందర్భంగా డైరెక్టర్ గిరిధర్ గోపాల్
విలేకరులతో ముచ్చటిస్తూ.. "నా మొదటి చిత్రం "దివ్యమణి"ని ప్రేక్షకులు ఆదరించినందుకు మొదటగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ సినిమాను చూసిన వారందరూ బాగా మెచ్చుకున్నారు. నెగటివ్ గా ఎవరూ చెప్పలేదు. ఇక నా గురుంచి చెప్పాలంటే విశ్వనాధ్ గారు, డైరెక్టర్ లక్ష్మీ దీపక్ దగ్గర, కెమెరామెన్ సత్తిబాబు దగ్గర వర్క్ నేర్చుకున్నాను.. ఫోటోగ్రఫీ, మ్యూజిక్, విఎఫ్ఎక్స్ లపై నాకు మంచి పట్టు ఉంది.. చాలా యాడ్స్ కు పనిచేశాను. ఆ సమయంలోనే దివ్యమణి సినిమాకు దర్శకత్వం వహించాను.. ఇప్పుడు నా రెండవ చిత్రంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ నాట్య కళాకారిణి పద్మశ్రీ యామిని కృష్ణమూర్తి గారి బయోపిక్ ను తెరకెక్కించనున్నాము..

యామిని కృష్ణమూర్తి నేటి తరానికి ఎంతో ఇన్స్పిరేషన్.. కూచిపూడి, భరతనాట్యం లలో తాను సాధించిన ప్రావీణ్యం ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే.. అతి చిన్న వయసులోనే తనకు పద్మశ్రీ, పద్మ విభూషన్, పద్మభూషణ్ లాంటి ఎన్నో అవార్డ్స్ అంది వచ్చాయి.. అలాంటి మహోత్తరమైన యామిని గారి జీవిత కథను అందరికీ తెలియచేయాలనే ఉద్దేశ్యంతో ఎంతో రీసెర్చ్ చేసి, అన్నీ టెక్నికల్ అంశాలపై సాధన చేసిన తరువాతే సినిమా గా రూపొందించాలని నిర్ణయం తెలుసుకున్నాను అని అన్నారు.
ఇక ఈ చిత్ర కాస్టింగ్ విషయానికి వస్తే.. బాలీవుడ్, కోలీవుడ్ కు సంబంధించిన ప్రముఖ నటీనటులను పరీశీలించుతున్నాం.. యామిని గారే తన బయోపిక్ కు కొరియోగ్రఫీ అందించనుండటం విశేషం.. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరకెకించనున్నాము. బేసిక్ గా నాకు సాహిత్యం అంటే చాలా ఇష్టం కనుక నేనె ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసి, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నా.. 10-20 రోజుల్లో ఈ బయోపిక్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేస్తాము" అని గిరిధర్ గోపాల్ చెప్పారు.


Click it and Unblock the Notifications