»   » ఆ సినిమా నందమూరి వంశానికా? అక్కినేని వంశానికా?

ఆ సినిమా నందమూరి వంశానికా? అక్కినేని వంశానికా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనవరి 14న బాలీవుడ్ లో విడుదలైన 'యమ్లా, పగ్లా, దీవానా" చిత్రం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో హీరో ధర్మేంద్ర తన ఇద్దరు కుమారులతో కలిసి నటించారు. ఇప్పుడు ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగులోని ఓ పెద్ద నిర్మాత ఈచిత్రం రైట్స్ తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ గా సాగే ఈ చిత్రం ఇక్కడ కూడా విజయం సాధిస్తుందని బావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ చిత్రాన్ని అక్కినేని వంశంతో తీయాలా లేక నందమూరి వంశం హీరోలతో తీయాలా అనేదే పెద్ద సందేహంగా తయారైంది.

మరో ప్రక్క కృష్ణవంశీ, నాగార్జన కాంబినేషన్ లో నాగవంశ అనే టైటిల్ తో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సి కళ్యాణ్ నిర్మించనున్న ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఈ నలుగురూ కలిసి నటిస్తే నటించనున్నారు. ఈ నలుగురు కలిసి నటించే చిత్రానికి సంబంధించి దర్శకుడు కృష్ణవంశీ మంచి కథను తయారు చేసుకున్నారు. కథ నాగార్జునకు నచ్చడంతో పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో పడ్డారు కృష్ణవంశీ. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu