For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు’ తాజా అప్డేట్స్

    By Bojja Kumar
    |

    స్విట్జర్లాండ్: అల్లరి నరేష్, రిచాపనయ్ జంటగా ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యముడికి మొగుడు'. ఇ.సత్తిబాబు దర్శకత్వంలో చంటి అడ్డాల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం స్విట్జర్లాండ్ లో జరుగుతోంది. హీరో హీరోయిన్లపై ఇక్కడ పాట చిత్రీకరిస్తున్నారు.

    ప్రముఖ కోరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో పాట చిత్రీకరిస్తున్నారు. కోటి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం గురించి చిత్ర నిర్మాత చంటి అడ్డాల మాట్లాడుతూ ప్రేమ్ రక్షిత్ డాన్స్‌తో స్విట్జర్లాండ్‌లో హీరో హీరోయిన్లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నామని, దీంతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని తెలిపారు.

    త్వరలో ఆడియో విడుదల చేసి నవంబర్ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుతున్న ఈ చిత్ర కథకు పేరు సరిపోయే విధంగా కుదిరిందని, హీరో, యముడి పాత్రల మధ్య సన్నివేశాలు సరికొత్తగా ఉంటాయని, రమ్యకృష్ణ, కృష్ణ్భగవాన్, చంద్రమోహన్‌ల హాస్యం హైలెట్‌గా నిలుస్తుందని దర్శకుడు ఇ.సత్తిబాబు తెలిపారు.

    తనికెళ్ళభరణి, నరేష్, కృష్ణ్భగవాన్, రఘుబాబు, చలపతిరావు, షాయాజీషిండే, ఏవీఎస్, మాస్టర్ భరత్, సత్యకృష్ణ, సన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మూలకథ: జయసిద్ధు, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, సంగీతం: కోటి, కెమెరా: కె.రవీంద్రబాబు, ఎడిటింగ్: గౌతంరాజ్, ఆర్ట్: కిరణ్‌కుమార్, సమర్పణ: ధనలక్ష్మి అడ్డాల, నిర్మాత: చంటి అడ్డాల, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.

    English summary
    Yamudiki Mogudu starring Allari Naresh and Richa Panai in the lead roles is currently being shot in Switzerland, where a song on the lead actors is being canned. Prem Rakshit is the choreographer of the song while Koti composed the musical scores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X