For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవికి కాపీ...(నరేష్ మూవీ ఫస్ట్ లుక్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ అల్లరోడు నరేష్ త్వరలో మెుగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ 'యముడికి మొగుడు' టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ టైటిల్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. టైటిల్ తో పాటు దాని డిజైన్ కూడా ఉన్నదున్నట్లు కాపీ చేశారు. దానికి 'ఈ నెలతక్కువోడు..' సబ్ టైటిల్‍‌ తగిలించారు. సినిమా స్టోరీలైన్ కూడా చిరంజీవి సినిమానే పోలి ఉంటుందని, అయితే అల్లరి నరేష్‌ బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యేలా స్ర్కీన్ ప్లే ఉంటుందని తెలుస్తోంది. చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని దీన్ని రిలీజ్ చేసారు.

    ఇ.సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రాన్ని శ్రీమతి అడ్డాల ధనలక్ష్మి సమర్పణలో చంటి అడ్డాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రిచా పనయ్ కథానాయిక. ఈ చిత్రంలో కోసం రాజమోజీ ఫిల్మ్ సిటీలో మొత్తం 11 భారీ సెట్లు వేశారు.

    ఇందులో యమునిగా షయాజీ షిండే, అతని భార్యగా రమ్యకృష్ణ నటిస్తోందని, సినీయర్ హాస్య నటీనటులతో ఆద్యంతం వినోదంతో రూపొందిస్తున్నారు. సీనియర్ నరేష్, గిరబాబు, చంద్రమోహన్, తనకెళ్ల భరణి, ఏవీఎస్, చలపతిరావు, రఘుబాబు, కృష్ణ భగవాన్, భరత్, సుధ, సత్యకృష్ణ, హేమ, సన, రజిత, చిట్టిబాబు, పృథ్వీ, సారిక రామచంద్రరావు ఇతర ముఖ్య తారాగణం. కథ: జయసిద్ధు, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, సంగీతం: కోటి, ఛాయా గ్రహణం: కె. వీరేంద్రబాబు, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: కిరణ్ కుమార్, నిర్మాత: చంటి అడ్డాల, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇ. సత్తిబాబు.

    English summary
    Comedy King Allari Naresh’s socio fantasy film has been titled ‘Yamudiki Mogudu’ and the title has the caption, ‘Ee nela thakkuvodu’. Richa Panai is the heroine in this film that is being produced by Friendly Movies Corporation. ‘Yamudiki Mogudu’ is the title of a famous Chiranjeevi film and it is perhaps why the title was released today, as it is Chiranjeevi’s birthday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X