అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు’ రిలీజ్ డేట్ ఖరారు

By Bojja Kumar

హైదరాబాద్ : అల్లరి 'నరేష్, రిచాపనయ్ నాయకానాయికలుగా ఇ సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మిస్తున్న 'యముడికి మొగుడు' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు, గ్రాఫిక్స్ వర్క్ చివరి దశకు చేరుకుంది. తొలి కాపీ సిద్ధమైన వెంనటే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ఆడియో గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే.

నిర్మాత చంటి అడ్డాల మాట్లాడుతూ..విభిన్న కథాంశంతో సోషియో ఫాంటసీకి వినోదాన్ని మేళవించి రూపొందిచిన ఈ చిత్రం అన్ని వర్గాలను అలరింపజేస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేసారు. నరేష్, తాను కలిసి చేస్తున్న మూడవ చిత్రమిది, పూర్తి వినోదభరితంగా ఉంటుందని దర్శకుడు సత్తిబాబు వెల్లడించారు.

స్విట్జర్లాండ్ పాట కూడా ఎంతో బాగా వచ్చిందని ఆయన తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో షాయాజీ షిండే, రమ్య కృష్ణ, నరేష్, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, కృష్ణ భగవాన్, రఘుబాబు, చలపతిరావు, ఏవీఎస్, మాస్టర్ భరత్, సత్యకృష్ణ, సన తదితరులు తారాగణం.

ఈ చిత్రానికి మూలకథ: జయసిద్ధు, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, సంగీతం: కోటి, ఛాయాగ్రహణం, కె. రవీంద్రబాబు, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: కిరణ్ కుమార్, ఫైట్స్: గణేష్, ప్రొడక్షన్ కంట్రోలర్: రామ్ చౌదరి, సమర్పణ: ధనలక్ష్మి అడ్డాల, నిర్మాత: చంటి అడ్డాల, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: ఇ.సత్తిబాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X