Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పవన్, టాప్ హీరోలను ఫాలో అవుతున్న అల్లరి నరేష్
హైదరాబాద్ : యముడి నేపథ్యంలో సోషియో ఫాంటసీగా రూపొందుతున్న చిత్రం 'యముడికి మొగుడు'. ఇందులో అల్లరి నరేష్ కథానాయకుడు కాగా రిచా పనయ్ కథానాయిక. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మిస్తున్న ఈచిత్రం ఒక పాట చిత్రీకరణ మినహా పూర్తయింది. కాగా ఆ పాటను స్విట్జర్లాండ్ హీరో హీరోయిన్లపై అక్టోబర్ 2 నుంచి 5 వరకు చిత్రీకరిస్తామని, దాంతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని నిర్మాత చంటి అడ్డాల తెలిపారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్, జూ ఎన్టీఆర్ లాంటి ఇతర టాప్ హీరోల చిత్రాలు చిత్రాలు స్విట్జర్ లాండ్ లో చిత్రీకరణ జరిగిన నేపథ్యంలో అల్లరి నరేష్ సినిమా షూటింగ్ కూడా అక్కడ జరుగుతుండటం చర్చనీయాంశం అయింది.
ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పాటను చిత్రీకరించామని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణానంత పనుల్లో భాగంగా సోమవారం నుంచి డబ్బింగ్ ను మొదలు పెట్టామని, మరో పక్క గ్రాఫిక్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. ఈ నెలాఖరుకు ఆడియోను, విజయదశమికి సినిమాను విడుదల చేస్తామని చెప్పారు.
దర్శకుడు సత్తిబాబు మాట్లాడుతూ 'మా కథకు అన్ని విధాలా సరిపోయే టైటిల్ ఇది. హీరో, యముడి పాత్రల మధ్య సన్నివేశాలు కొత్తగాను, ఎంతో ఆసక్తికరంగానూ ఉంటాయని' అన్నారు. నరేష్, రీచా పనయ్, రమ్య కృష్ణ, షాయాజీ షిండే, సీనియర్ నరేష్, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, రఘుబాబు, కృష్ణ భగవాన్, చలపతిరావు, ఏవీఎస్, మాస్టర్ భరత్, సత్యకృష్ణ, సన ఈ చిత్ర ముఖ్య తారాగణం.
ఈ చిత్రానికి మూలకథ : జయసిద్ధు, మాటలు : క్రాంతి సకినాల, పాటలు : రామ జోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్, సంగీతం : కోటి, ఫోటోగ్రఫీ : కె. రవీంద్రబాబు, ఎడిటింగ్ : గౌతం రాజు, కళ : కిరణ్ కుమార్, సమర్పణ : ధనలక్ష్మి అడ్డాల, నిర్మాత : చంటి అడ్డాల, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఇ. సత్తిబాబు.