twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు’ స్టోరీ లైన్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'సుడిగాడు' చిత్రంతో ఇటీవల భారీ విజయం సొంతం చేసుకున్న కామెడీ స్టార్ అల్లరి నరేష్.....త్వరలో 'యముడికి మొగుడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం స్టోరీ లైన్ గురించి నిర్మిత వెల్లడించారు. భిన్న కథాంశాన్ని ఎన్నుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, యముని కూతుర్ని ప్రేమించిన నరేష్ ఆమెతో స్విట్జర్లాండ్‌కు వెళ్లడం చిత్రంలో విశేషమని నిర్మాత చంటి అడ్డాల తెలిపారు.

    సుడిగాడు' హిట్ ఎఫెక్టుతో ఈ చిత్రం విడుదలకు ముందే భారీ బిజినెస్ చేస్తోంది. తాజాగా 'యముడికి మొగుడు' చిత్రం కృష్ణా జిల్లా రైట్స్ రూ. 60 లక్షలకు అమ్మడు పోయాయి. అల్లరి నరేష్ కెరీర్లోనే ఇక్కడ ఇది బెస్ట్ రేటు. అల్లరి నరేష్ మినిమమ్ గ్యారంటీ హీరో కావడం, సుడిగాడు చిత్రంతో అల్లరి నరేష్ రేంజి ఏమిటో తేలడంతో డిస్ట్రిబ్యూటర్లు నరేష్ పై భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందకు ముందుకు వస్తున్నారు. సుడిగాడు చిత్రం రికార్డును ఈచిత్రం క్రాస్ చేస్తుందని అంటున్నారు.

    అక్టోబర్ నెలలో స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించిన పాటతో యముడికి మొగుడు షూటింగ్ పూర్తయిందని దర్శకుడు ఇ.సత్తిబాబు తెలిపారు. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై అల్లరి నరేష్, రీచాపనయ్ జంటగా చంటి అడ్డాల నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందుతోంది.

    ఈనెల రెండో వారంలో ఆడియోను విడుదల చేసి, గ్రాఫిక్స్ పూర్తయ్యాక సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు తెలిపారు. షాయాజీషిండే, రమ్యకృష్ణ, భరత్, కృష్ణ్భగవాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: క్రాంతిరెడ్డి, సంగీతం: కోటి, కెమెరా: కె.రవీంద్రబాబు, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాత: చంటి అడ్డాల, కథనం, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.

    English summary
    Allari Naresh’s ‘Yamudiki Mogudu’ Krishna District rights for the film were picked up for approximately Rs. 60 lakhs, which is the career best price for Allari Naresh. Richa Panai is the heroine in this socio fantasy film which also has Ramya Krishna and Sayaji Shinde in key roles. Music for this movie is being scored by Koti and Sattibabu is the director. Chanti Addala is producing the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X