Don't Miss!
- News సంచలన నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు’ స్టోరీ లైన్!
హైదరాబాద్: 'సుడిగాడు' చిత్రంతో ఇటీవల భారీ విజయం సొంతం చేసుకున్న కామెడీ స్టార్ అల్లరి నరేష్.....త్వరలో 'యముడికి మొగుడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం స్టోరీ లైన్ గురించి నిర్మిత వెల్లడించారు. భిన్న కథాంశాన్ని ఎన్నుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, యముని కూతుర్ని ప్రేమించిన నరేష్ ఆమెతో స్విట్జర్లాండ్‌కు వెళ్లడం చిత్రంలో విశేషమని నిర్మాత చంటి అడ్డాల తెలిపారు.
సుడిగాడు' హిట్ ఎఫెక్టుతో ఈ చిత్రం విడుదలకు ముందే భారీ బిజినెస్ చేస్తోంది. తాజాగా 'యముడికి మొగుడు' చిత్రం కృష్ణా జిల్లా రైట్స్ రూ. 60 లక్షలకు అమ్మడు పోయాయి. అల్లరి నరేష్ కెరీర్లోనే ఇక్కడ ఇది బెస్ట్ రేటు. అల్లరి నరేష్ మినిమమ్ గ్యారంటీ హీరో కావడం, సుడిగాడు చిత్రంతో అల్లరి నరేష్ రేంజి ఏమిటో తేలడంతో డిస్ట్రిబ్యూటర్లు నరేష్ పై భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందకు ముందుకు వస్తున్నారు. సుడిగాడు చిత్రం రికార్డును ఈచిత్రం క్రాస్ చేస్తుందని అంటున్నారు.
అక్టోబర్ నెలలో స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించిన పాటతో యముడికి మొగుడు షూటింగ్ పూర్తయిందని దర్శకుడు ఇ.సత్తిబాబు తెలిపారు. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై అల్లరి నరేష్, రీచాపనయ్ జంటగా చంటి అడ్డాల నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందుతోంది.
ఈనెల రెండో వారంలో ఆడియోను విడుదల చేసి, గ్రాఫిక్స్ పూర్తయ్యాక సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు తెలిపారు. షాయాజీషిండే, రమ్యకృష్ణ, భరత్, కృష్ణ్భగవాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: క్రాంతిరెడ్డి, సంగీతం: కోటి, కెమెరా: కె.రవీంద్రబాబు, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాత: చంటి అడ్డాల, కథనం, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.