తెరకెక్కుతున్న మరో యండమూరి నవల
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ నవలలు చాలా బాగం తెలుగు తెరను ఎక్కి ప్రేక్షకాదారణను పొందిన సంగతి తెలిసిందే.అయితే నవలా చిత్రాలు బాగా తగ్గిపోవటంతో ఎవరూ ఈ మధ్యన ఆ సినిమాలు తీయటం లేదు. అయితే తాజాగా యండమూరి రాసిన 'అనైతికం"నవలను సినిమాగా చేయటానికి ఓ సంస్ధ ముందుకొచ్చింది. ఛార్మితో చేసిన'నగరం నిద్రపోతున్నవేళ" ఫేం ప్రేమ్‌రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.దర్శకుడు మాట్లాడుతూ ''మానవ సంబంధాల్లోని సంక్లిష్టతను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నమే ఇది. స్త్రీ, పురుషుల మధ్య సంబంధాల నేపథ్యంలో సాగుతుంద''న్నారు. కీర్తన మూవీ మేకర్స్ పతాకంపై టి.వెంకటేష్ యాదవ్, లక్కర్సు వెంకట్ నిర్మిస్తున్నారు. సమకాలీన రాజకీయాలు, సామాజిక సమస్యలే నేపథ్యం గా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టులో సెట్స్‌కెళ్లనుంది. కెమెరా: లక్ష్మీనరసింహన్, ఎడిటింగ్:మాధవ, సంగీతం: యశోకృష్ణ, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, కథనం-దర్శకత్వం: ప్రేమ్‌రాజ్.


Click it and Unblock the Notifications











