twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాపీ సమస్యే కాదు.. మగధీర, త్రివిక్రమ్ సినిమాలకు ఏమైంది.. యండమూరి!

    |

    ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు ఉన్న క్రీర్తి, ప్రతిష్టల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన నవలలతో అనేక చిత్రాలు కూడా వచ్చాయి. యండమూరి పెద్దగా మీడియా ముందుకు రారు. అప్పుడప్పుడూ సినిమాలపై, ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న సంగతులపై తన అభిప్రాయాలు చెబుతుంటారు. తాజాగా యండమూరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ లో కథల కాపీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కాపీ ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. ఆ చిత్రం గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్ చిత్రాలు, మగధీర గురించి కూడా యండమూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

     నా శిష్యుడే

    నా శిష్యుడే

    మిస్టర్ పర్ఫెక్ట్ చిత్ర దర్శకుడుపై కాపీ ఆరోపణలు వచ్చాయని, శ్యామల దేవి అనే రచయిత వేసి నెగ్గారనే విషయం తెలియగానే యండమూరి ఆశ్చర్యపోయారు. ఆ చిత్ర దర్శకుడు దశరథ్ నా శిష్యుడే. దశరథ్ నాకు ఈ విషయం చెప్పలేదే.. దశరథ్ ని అడిగి పూర్తి వివరాలు కనుక్కుంటా.. ఇలాంటి కాపీ కేసులు పెద్దగా నిలబడని యండమూరి అన్నారు. సినిమాలపై వచ్చే కాపీ కేసుల గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కోర్టులో కేసు కొనసాగుతూ ఉంటుంది లేదా డబ్బులిచ్చి మేనేజ్ చేస్తారు.. అంతకు మించి పెద్దగా జరిగేది ఏమీ ఉండదని యండమూరి అన్నారు.

    చాలా సినిమాల్లో ఉంది

    చాలా సినిమాల్లో ఉంది

    యండమూరి మాట్లాడుతూ.. అయినా మిస్టర్ పర్ఫెక్ట్ లో కాపీ కొట్టేంత కథ ఏముంది అని అన్నారు. అలాంటి కథ చాలా చిత్రాల్లో కనిపిస్తుంది. కాకపోతే కొంచెం మార్పులు చేస్తారు. చిత్రంలోని దాదాపు 28 సన్నివేశాలని తాను రాసిన 'నా మనసు కోరింది నిన్నే' అనే నవలనుంచి కాపీ చేశారని కోర్టులో కేసు వేశారు. ఆమె వాదనతో ఏకీభవించిన కోర్టు.. టెలివిజన్, సామజిక మాధ్యమాలలో ఆ చిత్ర ప్రసారాలని నిలిపివేయాలని ఆదేశించింది.

    త్రివిక్రమ్ సినిమాలకు

    త్రివిక్రమ్ సినిమాలకు

    గతంలో ఇలాంటి ఆరోపణలు త్రివిక్రమ్ చిత్రాలకు కుడా ఎదురైంది. అయినా ఆ చిత్రాలకు ఎమన్నా అయిందా.. లేదు కదా. మగధీర కథ కుడా కాపీ అంటూ ఓ రచయిత కేసు వేశారు. అప్పుడే నేను చెప్పాను. ఇప్పుడొచ్చి మగధీర కాపీ అంటావెంటయ్యా.. ఇలాంటి కథలు మూగ మనసులు కాలం నుంచి వస్తున్నాయి. ప్రేమికులిద్దరూ చనిపోతారు.. మరో జన్మలో కలుసుకుంటారు. నీ కేసు నిలబడదు అని అతడితో చెప్పినట్లు యండమూరి అన్నారు.

    ఈ తరం హీరోల్లో

    ఈ తరం హీరోల్లో


    ప్రస్తుతం తాను చాలా తక్కువగా సినిమాలు చూస్తున్నానని అన్నారు. 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రం చూశా.. బాగా నచ్చిందని యండమూరి అన్నారు. ఈ తరం హీరోల్లో నాని బాగా చేస్తున్నాడని అన్నారు. జెర్సీ చిత్రం బావుందని విన్నానని అన్నారు. తాను కొంత టచ్ లో ఉండేది రాఘవేంద్ర రావు, కొండరామిరెడ్డితో అని అన్నారు. వారిద్దరూ తన కథలతో సినిమాలు చేశారని యండమూరి అన్నారు.

    English summary
    Yandamuri Veerendranath About Copy Right Problems In Tollywood Industry
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X