ఆ హీరోపై మళ్లీ చీటింగ్ ఆరోపణలు
సాండల్‌వుడ్ రాకింగ్ స్టార్‌గా పేరుగాంచిన యాష్ సినిమా చేస్తానని చెప్పి కన్నడ నిర్మాత తిమ్మరాజు వద్ద రూ. 10 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. అయితే ఎన్ని రోజులైనా యాష్ డేట్స్ ఇవ్వక పోగా, తన డబ్బు తిరిగి ఇవ్వడానికి కూడా మొండికేస్తుండటంతో తిమ్మరాజు నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసారు. తనకు న్యాయం చేయాలని కోరారు.
అయితే యాష్ వాదన వేరేలా ఉంది. 2008లో తాను అనిల్ దర్శకత్వంలో సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకున్న మాట వాస్తవమే అని. తాను డేట్స్ ఇచ్చి సినిమా కోసం ఎదురు చూసానని. అయినప్పటికీ సినిమా మొదలుకాలేదు. ఈ సినిమాకు కమిట్ కావడం వల్ల తాను వేరే సినిమాలు ఒప్పుకోలేదు. ఆరు నెలల పాటు నా డేట్స్ వేస్ట్ అయ్యాయి. అందుకే నేను అడ్వాన్స్ తిరిగి ఇవ్వ లేదని యాష్ వాదిస్తున్నారు.
కన్నడ సినీ పరిశ్రమలో చాలా మంది ముందు అడ్వాన్స్ తీసుకుని డేట్స్ ఇస్తుంటారని, నిర్మాత తాము ఇచ్చిన డేట్స్ వాడుకుని సినిమా చేయకపోతే ఎవరూ తిరిగి అడ్వాన్స్ ఇచ్చేయరని చెప్పుకొచ్చారు. ఇప్పుడు నాకు మార్కెట్లో ఉన్న రెమ్యూనరేషన్ ఇస్తే అతనితో సినిమా చేయడానికి తాను సిద్ధమే అని యాష్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications












