పుష్ప రాజ్ పై పొగడ్తలు కురిపించిన రమికా సేన్.. ఆ విషయంలో ఆరాధిస్తానన్న రాఖీ భాయ్!
పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన KGF చాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా 2018లో విడుదలైన KGF సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ సినిమా చూసిన కొంతమంది సినీ ప్రముఖులు సినిమా గురించి తమకు నచ్చిన విషయాలు పంచుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా KGF సినిమాపై తనదైన శైలిలో ప్రసంసల వర్షం కురిపించగా ఇప్పుడు ఆయన ట్వీట్ కు రవీనా టాండన్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..

అద్భుతంగా ఉంది అంటూ
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన KGF చాప్టర్ 1 ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన చాప్టర్ 2 కూడా రకరకాల రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల కోట్ల కలెక్షన్స్ అందుకని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఈ సినిమా అద్భుతంగా ఉంది అంటూ దాదాపు అందరూ స్పందిస్తున్నారు.

అద్భుతమైన నటనతో
అయితే తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ KGF చాప్టర్ 2 సినిమా చూశారు. ఈ క్రమంలో ఆయన చిత్ర యూనిట్ అందరి మీద ప్రశంసల వర్షం కురిపించాడు. ''KGF2 కి అభినందనలు. యష్ గారి పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది, సంజయ్ దత్, రవీనా టాండన్ కూడా అద్భుతమైన నటనతో మెప్పించారు'' అని అల్లు అర్జున్ తెలియజేశారు.

సినిమా మొత్తానికి హైలెట్
ఇక ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటులు కూడా ఎంతగానో ఆకర్షించారని మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలాగే భువన్ గౌడ అద్భుతమైన విజువల్స్ సినిమా మొత్తానికి హైలెట్ అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

అందరికీ ధన్యవాదాలు
అంతేకాక ఈ సినిమా కోసం పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ బన్నీ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అద్భుతమైన దర్శకత్వ ప్రదర్శన బాగా మెప్పించిందని ఆయన దృక్పథానికి, నమ్మకానికి నా గౌరవం అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించినందుకు అలాగే మన భారతీయ సినిమాలు హై లెవల్ లో పతాకాన్ని ఎగురవేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు.. అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని బ్లాక్ బస్టర్స్ రావాలి
అయితే అల్లు అర్జున్ ట్వీట్‌కు బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ రిప్లై ఇచ్చారు." థాంక్యూ అల్లు అర్జున్. నేను మీకు పెద్ద అభిమానిని. మీ పుష్ప సినిమా చాలా నచ్చింది. మీకు మరిన్ని బ్లాక్ బస్టర్స్ రావాలి" అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఇక ఈ సినిమా హీరో యష్ కూడా ఈ సినిమా గురించి అల్లు అర్జున్ స్పందన మీద స్పందించారు. ''థాంక్యూ అల్లు అర్జున్, నేను మీ హార్డ్ వర్క్, కన్విక్షన్ విషయంలో ఆరాధిస్తూ ఉంటాను, మీరు ఎప్పుడూ ఉండేలాగానే ఆసంగా ఉండండి, ఛీర్స్ అంటూ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











