Don't Miss!
- News ఏపీలో కేసుల్లో ఈయనే టాప్; సెంచరీకి చేరువగా టీడీపీ అభ్యర్థిపై కేసులు!!
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
డెంగ్యూ తో హాస్పటిల్ లో చేరిన స్టార్ డైరక్టర్
షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'జబ్ తక్ హై జాన్'. యశ్ చోప్రా దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తరవాత ఆయన మెగాఫోన్ చేతపట్టారు. కత్రినా కైఫ్ తొలిసారిగా ఈ చిత్రంలో షారుఖ్‌తో కలిసి నటిస్తోంది. అనుష్క శర్మ మరో కథానాయిక. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని ఇటీవల విడుదల చేశారు. షారుఖ్ ఆర్మీ అధికారి పాత్రను పోషించారు. సున్నితమైన భావోద్వేగాలు ముడిపడ్డ ప్రేమ కథతో ఈ చిత్రం రూపుదిద్దుకొంది. ప్రేమిస్తే... ప్రాణం ఉన్నంత వరకూ ప్రేయసిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలనే అంశాన్ని దీంట్లో చెప్పబోతున్నారు. అనుష్క శర్మ పాత్ర ఎలా ఉండబోతోందనేది సస్పెన్స్. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు.
యష్ చోప్రా దర్శకత్వంలో రూపొందిన జబ్ తక్ హై జాన్ ఇప్పటికే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. షారుఖ్, కత్రినాకైఫ్, అనుష్కశర్మలు నటిస్తున్న ఈ చిత్రానికి ఎనిమిదేళ్ల తరువాత యష్‌చోప్రా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. రోమంటిక్ ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం, గుల్జార్ సాహిత్యాన్ని అందిస్తున్నారు. ఇటీవలే కాశ్మీర్లో షూటింగ్ పూర్తి చేసుకున్నా ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది.