twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డెంగ్యూ తో హాస్పటిల్ లో చేరిన స్టార్ డైరక్టర్

    By Srikanya
    |

    ముంబై : డెంగ్యూ ప్రతాపం రోజురోజుకు పెరుగుతోంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత యశ్‌చోప్రా డెంగ్యూ బారిన పడగా, ఒడిసాలోని గంజాం జిల్లాలో డెంగ్యూ రోగుల సంఖ్య 368కి పెరిగింది. బంద్రాలోని లీలావతి ఆసుపత్రిలో యశ్‌చోప్రా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉన్నట్లు యశ్‌చోప్రా ఫిల్మ్స్ ప్రతినిధి తెలిపారు. సినిమా డెరైక్టర్‌గా రిటైరవుతున్నట్టు 80 ఏళ్ల చోప్రా గత నెలలో ప్రకటించారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'జబ్ తక్ హై జాన్' నవంబర్ 13న విడుదల కానుంది. ఇందులో షారూఖ్‌ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ నటించారు.

    షారుఖ్‌ ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'జబ్‌ తక్‌ హై జాన్‌'. యశ్‌ చోప్రా దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తరవాత ఆయన మెగాఫోన్‌ చేతపట్టారు. కత్రినా కైఫ్‌ తొలిసారిగా ఈ చిత్రంలో షారుఖ్‌తో కలిసి నటిస్తోంది. అనుష్క శర్మ మరో కథానాయిక. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని ఇటీవల విడుదల చేశారు. షారుఖ్‌ ఆర్మీ అధికారి పాత్రను పోషించారు. సున్నితమైన భావోద్వేగాలు ముడిపడ్డ ప్రేమ కథతో ఈ చిత్రం రూపుదిద్దుకొంది. ప్రేమిస్తే... ప్రాణం ఉన్నంత వరకూ ప్రేయసిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలనే అంశాన్ని దీంట్లో చెప్పబోతున్నారు. అనుష్క శర్మ పాత్ర ఎలా ఉండబోతోందనేది సస్పెన్స్‌. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు.

    యష్‌ చోప్రా దర్శకత్వంలో రూపొందిన జబ్‌ తక్‌ హై జాన్‌ ఇప్పటికే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. షారుఖ్‌, కత్రినాకైఫ్‌, అనుష్కశర్మలు నటిస్తున్న ఈ చిత్రానికి ఎనిమిదేళ్ల తరువాత యష్‌చోప్రా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. రోమంటిక్‌ ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం, గుల్జార్‌ సాహిత్యాన్ని అందిస్తున్నారు. ఇటీవలే కాశ్మీర్‌లో షూటింగ్‌ పూర్తి చేసుకున్నా ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది.

    English summary
    Filmmaker Yash Chopra, who recently turned 80, was hospitalised here after he felt weak but he is fine now, a spokesperson for the hospital said . Dr Suhir Dagaonkar, spokesperson of Lilavati Hospital told : "Yes, he is admitted at Lilavati Hospital." The filmmaker had announced his retirement from film direction last month. He is looking forward to the release of his latest directorial venture Jab Tak Hai Jaan that stars Shah Rukh Khan, Katrina Kaif and Anushka Sharma in the lead.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X