'ఈగ' సుదీప్ హీరోగా అమితాబ్ సూపర్ హిట్ రీమేక్ ఖరారు
ఇంద్రజిత్ మాట్లాడుతూ... "యష్ చోప్రా జీవించి ఉన్నప్పుడే ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు. సుదీప్, దర్శన్ ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నాను. దర్శన్ తో మీరు చెయ్యాలని నా కోరిక చెప్పాను. ఆయన ఒప్పుకుంటారనే భావిస్తున్నాను. వారి డేట్స్ ని బట్టి సినిమా షూటింగ్ మొదలవుతుంది.." అన్నారు.
ఇక దీవార్ ని అప్పట్లో తెలుగులో ఎన్‌టిఆర్, రామకృష్ణలతో మగాడుగా తెరకెక్కించి 1976లో విడుదల చేశారు. ఈ సినిమాను ఆ తర్వాత తమిళంలో రజీనీకాంత్, సుమన్, శ్రీప్రియలతో థీ పేరుతో తీసి 1980లో విడుదల చేశారు. దీవార్ స్ఫూర్తితోనే నామ్ చిత్రం కూడా రూపొందింది. దీవార్ సహరచయితలే దీనికి రచన అందించారు.
దీవార్ సినిమా 1975 ఫిలింఫేర్ అవార్డుల్ని అన్ని కొట్టుకుపోయాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్,ఉత్తమ ధ్వనిలతో పాటు ఉత్తమ కధ, ఉత్తమ సంభాషణలు, ఉత్తమ స్క్రీన్‌ప్లే...మూడింటిని సలీమ్ జావీద్‌లు గెలుచుకున్నారు. ఉత్తమ నటుడుగా అమితాబ్, ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా నిరుపారాయ్‌లు నామినేషన్‌లు మాత్రం పొందారు. ఈ దీవార్ చిత్రం కన్నడంలోనూ మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications












