Don't Miss!
- News మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- Finance Gold Rate: రంకెలు వేస్తున్న బంగారం ధరలు.. నేడు రూ.3,800 పెరగటంతో..
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- Sports Hardik Pandya: కెప్టెన్‌గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
దేశానికి రాజైనా కూడా తల్లికి మాత్రం కొడుకే అనే పాత సామెత అందరికీ తెలిసిందే. అదే విధంగా ఎంతటి భీకరమైన రాకీ భాయ్ అయినా కూడా పిల్లలకు తండ్రే కదా. అలా వెండితెరపై విజృంభించే యశ్ ఇప్పుడు కూల్ అయిపోయాడు. మాల్దీవుల్లో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తన భార్య, పిల్లలతో కలిసి వెకేషన్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం యశ్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
సెలెబ్రిటీలందరూ అక్కడికే..
సినీ సెలెబ్రిటీలందరూ వరుసబెట్టి మాల్దీవులకు పయణమవుతున్నారు. లాక్డౌన్ తరువాత అందరూ కూడా వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. ఇంకా వెళ్తున్నారు కూడా. కొత్తగా పెళ్లి చేసుకున్న సినీ జంటలు హనీమూన్ కోసం మాల్దీవులకే చెక్కేశారు.
నిరంతరం షూటింగ్..
లాక్డౌన్ వల్ల ఇంట్లో నాలుగు గోడల మధ్యే ఉండి.. అన్ లాక్ ప్రక్రియ తరువాత నిర్విరామంగా షూటింగ్‌లు చేయడంతో రాకింగ్ స్టార్ యశ్ కాస్త బ్రేక్ తీసుకోవాలని కోరుకున్నట్టుంది. అందుకే యశ్ తన ఫ్యామిలీని మాల్దీవులకు తీసుకెళ్లాడు. భార్య, పిల్లలతో కలిసి అక్కడ సందడి చేస్తున్నాడు.
స్వర్గమంటూ..
మాల్దీవుల్లో తన ఫ్యామిలీతో దిగిన యశ్ అక్కడ తెగ సందడి చేస్తున్నాడు. స్వర్గమంటూ ఉంటే అది ఇదే అంటూ మాల్దీవుల అందాలను ప్రశంసించాడు. ఇక ఇప్పుడు యశ్ తన పిల్లలు చేసే అల్లరిని చూసి షాక్ అవుతున్నట్టున్నాడు.
పిల్లలతో కలిసి..
యశ్ తన పిల్లలు అక్కడి బీచ్‌లో ఆడుతుంటే సాయం చేసినట్టున్నాడు. వారితో కలిసి యశ్ కూడా ఆటలు ఆడినట్టున్నాడు. అలా తెరపై రాకీ భాయ్‌గా విజృంభించిన యశ్.. ఇలా తన పిల్లల కోసం చిన్న పిల్లాడిగా మారిపోడంతో అందరూ షాక్ అవుతున్నారు. నీళ్లు, ఇసుక ఎప్పుడూ కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేదు.. కానీ ఈ పిల్లలు ఆడుకుంటుంటే మాత్రం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.
టీజర్ హిట్..
కేజీయఫ్ చాప్టర్ 2 టీజర్ ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. వ్యూస్, లైక్స్‌లో చాప్టర్ 2 టీజర్ ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. చెప్పిన సమయం కంటే ముందే రిలీజ్ చేసినా, ముందే లీకైనా కూడా టీజర్ మాత్రం అందరినీ కట్టిపడేసింది.