KGF 2 ప్రపంచ రికార్డ్.. టీజర్ తోనే రాఖీ బాయ్ సంచలనం!
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన KGF చాప్టర్ 1 ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా సాధించిన విజయంతో కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయి అమాంతంగా పెరిగిపోయింది. తాము కూడా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించగలమని నిరూపించారు. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ చాప్టర్ 2ని కూడా అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు.
KGF 2 ఫస్ట్ టీజర్ ను విడుదల చేసిన నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. జనవరి 7న విడుదల చేసిన ఈ టీజర్ 24గంటల్లో ఇండియాలోనే అత్యదిక వ్యూవ్స్ అందుకున్న టీజర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తరువాత ఎన్నో రికార్డులను అందుకున్న ఈ టీజర్ రీసెంట్ గా మరో మార్క్ ను అందుకుంది. 175మిలియన్ వ్యూవ్స్ తో పాటు 8 మిలియన్ లైక్స్ ను అందుకుంది.

దీంతో ప్రపంచంలోనే అత్యదిక వ్యూవ్స్, లైక్స్ అందుకున్న టీజర్ గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. టీజర్ తోనే సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక KGF 2 వరల్డ్ వైడ్ గా జూలై 16న రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల సినిమా పనులు మొత్తం పూర్తయ్యాయి. ఇక అన్ని భాషల్లో రిలీజ్ కాబోయే సినిమా కాబట్టి ప్రమోషన్ డోస్ పెంచాలని ప్లాన్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











