2.O కంటే హై రేంజ్ లో KGF డిజిటల్ రైట్స్.. పెట్టిన బడ్జెట్ లో సగం వెనక్కి వచ్చినట్లే!
దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న మొదటి కన్నడ సినిమా KGF చాప్టర్1. ఆ సినిమాతోనే హీరో యష్ స్థాయి పాన్ ఇండియా లెవెల్ కు చేరింది. తెలుగు తమిళ్ అని తేడా లేకుండా బాలీవుడ్ లో సైతం ఈ యాక్షన్ మూవీ సాలీడ్ కలెక్షన్స్ ని అందుకుంది. చాప్టర్ 2 కోసం ప్రపంచం వ్యాప్తంగా ఇండియన్ సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ లో ఇప్పటివరకు ఉన్న 2.O రికార్డును సైతం బ్రేక్ చేసి పెట్టిన బడ్జెట్ లో సగం వెనక్కి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.

KGF 2లో కూడా అదే తరహాలో
కేజీఎఫ్ చాప్టర్ 1 లో ఎమోషన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎవరు ఊహించని విధంగా మనసుకు హద్దుకునేలా ప్రజెంట్ చేశాడు. అందుకే అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆ సినిమా అంత బాగా ఆకట్టుకుంది. ఇక అదే తరహాలో సెకండ్ పార్ట్ కూడా అంతకు మించిన ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్ ఉంటాయని ఆడియెన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. కథలో ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ అద్బుతంగా ఉంటుందని తెలుస్తోంది.

KGF 1 అలా సక్సెస్ కావడంతో
ఇక సినిమా బిజినెస్ విషయంలో చిత్ర నిర్మాతలకు భారీగా లాభాలు అందుతున్నట్లు సమాచారం. KGF చాప్టర్ 1 డిజిటల్ వరల్డ్ లో కూడా ఒక సంచలనం క్రియేట్ చేసింది. అమెజాన్ ప్రైమ్ లో అత్యదిక మంది వీక్షించిన సినిమాల్లో ఈ సినిమా కూడా టాప్ లో ఉంది. టీవీల్లో కూడా మంచి రేటింగ్స్ అందుకుంది. దీంతో KGF 2కు భారీ స్థాయిలో డిమాండ్ పెరిగింది.

2పాయింట్ ఓ రికార్డ్
ఇప్పటివరకు డిజిటల్ వరల్డ్ లో అత్యదిక స్థాయిలో లాభాలు అందుకున్న ఏకైక సినిమా రజనీకాంత్ 2పాయింట్ ఓ. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదల తరువాత అంచనాలను అందుకోలేకపోయింది. అయితే విడుదలకు ముందే ఈ సినిమా దాదాపు అన్ని భాషల్లో కలుపుకొని శాటిలైట్, ఓటీటీ రైట్స్, మ్యూజిక్ రైట్స్ రూపంలో నిర్మాతలకు 110కోట్ల వరకు ఆదాయాన్ని అంధించాయి.

KGF 2 న్యూ రికార్డ్
ఇక ఆ రికార్డును ఇప్పుడు యష్ KGF 2 బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అన్ని భాషల్లో డిజిటల్ కు సంబంధించిన బిజినెస్ డీల్స్ ను క్లోజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ రూట్లో సినిమాకు దాదాపు 120కోట్లకు పైగా లాభాలు అందినట్లు సమాచారం.

పెట్టిన బడ్జెట్ లో సగం వెనక్కి వచ్చేసినట్లే
KGF 2కోసం మొదట వందకోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ ఆ తరువాత ప్లాన్స్ చేంజ్ చేయడంతో బడ్జెట్ అమాంతంగా 150కోట్లు దాటేసింది. ఇక ఇప్పుడు డిజిటల్ రైట్స్ ద్వారా నిర్మాతలకు అయితే సగం వరకు పెట్టిన బడ్జెట్ వెనక్కి వచ్చేసిందని చెప్పవచ్చు. ఇక రానున్న రోజుల్లో సినిమా థియేట్రికల్ బిజినెస్ ద్వారా కూడా నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలు వస్తాయని చెప్పవచ్చు. ఇక సినిమాను జూలై 16న రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











