KGF Chapter 2 అప్డేట్.. రాకీ భాయ్ రచ్చ చేసిది ఆరోజే
ప్రశాంత్ నీల్, యశ్ కాంబోలో వచ్చిన కేజీయఫ్ సినిమా సంచలనాలు, రికార్డుల గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే చెప్పి చెప్పి అరిగిపోయిన టేప్ రికార్డ్‌ల అయిపోయింది. చాప్టర్ 2 టీజర్ క్రియేట్ చేసిన వండర్స్, వరల్డ్ వైడ్ రికార్డుల గురించి చెప్పుకొచ్చాలి. మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టడం ఈజీనే కానీ మిలియన్ల కొద్ది లైకులను సాధించడం అంత సులభం కాదు. కానీ యశ్ అది సాధించి చూపించాడు.
కానీ చాప్టర్ 2 మాత్రం దాదాపు ఏడు మిలియన్ల లైకులను కొల్లగొట్టేసింది.అలా చాప్టర్ 2 కోసం అందరూ ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం దక్షిణాదిలో అందరూ కూడా తమ తమ సినిమాలకు డేట్లను ఫిక్స్ చేసుకునే పనిలో పడ్డారు. ఈక్రమంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తూ బెర్త్‌లను కన్ఫామ్ చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే కేజీయఫ్ చాప్టర్ 2 విడుదల తేదీని ప్రకటించారు.

ఇప్పటికే ప్రకటించిన సినిమాలు, వాటి రిలీజ్ డేట్లను ప్రశాంత్ నీల్ పరిగణలోకి తీసుకున్నట్టున్నాడు. ఆచార్య, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి పెద్ద సినిమాలకు పోటీగా కాకుండా సింగిల్ రిలీజ్‌ను ప్లాన్ చేశాడు. అందుకోసం జూలై 16ను ప్రశాంత్ నీల్ ఎంచుకున్నాడు. ఎందుకంటే పుష్ప ఆగస్ట్‌లో, ఆర్ఆర్ఆర్ అక్టోబర్‌లో, ఆచార్య మేలో వచ్చేస్తున్నాయి. అలా చాప్టర్ 2 సింగిల్‌గా జూలై మధ్యలో దిగి బాక్సాఫీస్‌ను ఓ ఆట ఆడేసుకోనుంది.



Click it and Unblock the Notifications











