వంద మిలియన్ల టీజర్.. అదే ప్రశాంత్ నీల్ స్ట్రాటజీ.. అందుకే ఇన్ని రికార్డులు
ఏది ఏమైనా కేజీయఫ్ చాప్టర్ 2 టీజర్ ఇంతలా వైరల్ అవ్వడం వెనక ప్రశాంత్ నీల్ మాస్టర్ మైండ్ కనిపిస్తోంది. అసలు సిసలు ప్యాన్ ఇండియన్ సినిమా, దాని టీజర్ అంటే ఇలా ఉండాలి అని నిరూపించుకుంది. ఈ టీజర్‌ను సరిగ్గా గమనిస్తే ఓ విషయం అర్థమవుతుంది. అందులోనే అసలు మర్మం ఉంది. అక్కడే ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడు. మాములుగా ప్యాన్ ఇండియన్ సినిమాలంటే ఓ ఫార్మాట్‌ను వాడుతారు. కానీ ప్రశాంత్ నీల్ దాన్ని బ్రేక్ చేశాడు.

బహుభాషల్లో..
ప్యాన్ ఇండియన్ చిత్రాలు అంటే దాదాపు బహుభాషల్లో టీజర్లు, ట్రైలర్లు రిలీజ్ చేస్తుంటారు. ఆర్ఆర్ఆర్ కూడా అంతే. దాదాపు ఐదారు భాషల్లో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో తెలుగులో మాత్రమే వాటికి రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. సాహో, రాధేశ్యామ్ ఇలా ఏది తీసుకున్నా కూడా అంతే. అలా మల్టిపుల్ లాంగ్వెజెస్‌లో రిలీజ్ చేయడంతో సమస్య వస్తుంది. వ్యూస్ వేర్వేరుగా వస్తుంటాయి.

చాప్టర్ 2 అలా..
అయితే చాప్టర్ 2 టీజర్‌లో మాత్రం డైలాగ్‌లు లేకుండా కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, ఎలివేషన్స్, ప్రతీ ఒక్క పాత్రను పరిచయం చేస్తూ పోయాడు.చివరకు రాకీ భాయ్ విశ్వరూపాన్ని, మాసిజాన్ని చూపించాడు. దీంతో టీజర్‌కు భాషలతో సంబంధం లేకుండాపోయింది. మొత్తంగా ఒకే టీజర్ కింద జమపడింది.

రికార్డుల్లో కొత్త పుంతలు..
టీజర్ ముందుగానే లీక్ అయినా కూడా ఒరిజినల్ టీజర్ ధాటికి తట్టుకోలేకపోయింది. మొత్తంగా చాప్టర్ టీజర్ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇంత వరకు పాటలు మాత్రం వంద మిలియన్ల ఫీట్‌ను అందుకునేవి. టీజర్ ఇలా వంద మిలియన్లను కొట్టడం మాత్రం ఎవ్వరూసాధించని ఫీట్.

లైకులు,వ్యూస్..
చాప్టర్ 2 టీజర్ రికార్డ్‌లలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిల్చుంది. వంద మిలియన్ల వ్యూస్‌ను ఢీ కొట్టడం ఒకెత్తు అయితే.. లైకుల విషయంలో మాత్రం ఇది సరికొత్త ప్రభంజనం. 5.3 మిలియన్ వ్యూస్‌లు కొల్లగొట్టి ఇంకా యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలోనే ట్రెండ్ అవుతోంది. రాకీ భాయ్ మానియా ఇంకా తగ్గడం లేదు. మున్ముందు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











