యశోసాగర్ బర్త్ డే...కొత్తచిత్రం
'ఉల్లాసంగా ఉత్సాహంగా ' చిత్రం గత ఏడాది మంచి విజయం సాధించింది. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా యశోసాగర్ హీరోగా పరిచయమయ్యారు. తాజాగా యశోసాగర్ కథానాయకుడుగా రెండవ చిత్రాన్ని అమృత్ అమర్ నాథ్ ఆర్ట్స్ సంస్థ ప్రకటించింది. బి.పి.సోము నిర్మాతగా ఎన్.ఎస్.నాయుడు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈరోజు(04.09.09) యశోసాగర్ బర్త్ డే కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ అమృత్ అమర్ నాథ్ ఆర్ట్స్ సంస్థ కొత్త చిత్రం వివరాలను తెలియజేసేంది.
నిర్మాత బి.పి.సోము మాట్లాడుతూ, తొలి చిత్రంతో సక్సెస్ ఫుల్ హీరోగా అనిపించుకున్న యశోసాగర్ తో కొత్త చిత్రాన్ని ప్లాన్ చేశామనీ, అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందనీ తెలిపారు. 'మంత్ర' సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన ఎన్.ఎస్.నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారనీ, కన్నడంలో పెద్ద సక్సెస్ సాధించిన 'ముంగారు మలై' చిత్రానికి కెమెరామన్ గా పనిచేసిన ఎస్.కృష్ణప్ప ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తారనీ తెలిపారు. అలాగే ఎ.ఆర్.రెహ్మాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ ('ఉల్లాసంగా ఉత్సాహంగా'') సంగీతం అందిస్తారనీ తెలిపారు. యశోసాగర్ కు జోడిగా కన్నడ ప్రభాకర్-జయమాల దంపతుల కుమార్తె సౌందర్యను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నామని చెప్పారు. కథ-స్క్రీన్ ప్లే సైతం ఎన్.ఎస్.నాయుడు సమకూర్చనున్నారు. ఈ సందర్బంగా యశోసాగర్ కు దట్స్ తెలుగు తరపున బెస్ట్ విసెష్ అందిస్తూ, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.


Click it and Unblock the Notifications











