కరణాకరన్ దర్శకత్వంలో వచ్చిన 'ఉల్లాసంగా ఉల్లాసంగా' సినిమా మంచి టాక్ తో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఆ సినిమా నిర్మాత ...హీరో యశోసాగర్ తండ్రి అయిన బి.సి.సోము తన కుమారుడు తర్వాత సినిమాని కూడా యూత్ కి నచ్చే ఫీల్ గుడ్ ఫిలింగా మలచాలని యోచిస్తున్నారు. ఆ తరహా సినిమాలకు ట్రేడ్ మార్క్ గా మారన శేఖర్ కమ్ముల తో సినిమా చేయాలని సంప్రదించారు. 'హ్యాపీడేస్' తర్వాత గ్యాప్ తో స్క్రిప్టు రెడీ చేసుకుంటున్న శేఖర్ కూడా ఈ ప్రపోజల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.అమృత ఆర్ట్ బ్యానర్ పై త్వరలోనే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.