‘వైఎస్ భారతిని అలా ముద్దు పెట్టుకోవాలని ఉంది’ (వీడియో)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితాల్లో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర 2. యువ దర్శకుడు మహీ వీ రాఘవ రూపొందించిన ఈ సినిమాలో ప్రధాన పాత్ర వైఎస్ భారతీ రోల్‌లో మరాఠీ నటి కేతకీ నారాయణ్ నటించారు. మేక శివ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కేతకీ నారాయణ్ ఫిలింబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ..

వైఎస్ భారతీ పాత్రలో నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఆమె అందరికీ స్పూర్తిని కలిగించే మహిళ. ఓ మంచి తల్లి, భార్య. అంతేకాకుండా మంచి బిజినెస్ ఉమెన్. అలాంటి వ్యక్తి పాత్రను పోషించడం నిజంగా ఓ ఛాలెంజ్. నేను చేసిన ఆ పాత్రను మీరు థియేటర్‌లో చూస్తే.. డెఫినెట్‌గా కొత్త అనుభూతిని పొందే అవకాశం ఉంది అని కేతకీ నారాయణ్ అన్నారు.

వైఎస్ భారతీ పాత్ర పోషించడానికి ముందు ఆమె వీడియోలు, ఫోటోలు చాలా పరిశీలించాను. అలాగే ఆమె ఫ్యామిలీతో సంబంధం ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. దర్శకుడు మహీ వీ రాఘవ చాలా విషయాలు చెప్పారు. ఆమె గురించి తెలుసుకొన్నాను. ఆమె కేవలం సీఎంకు భార్య మాత్రమే కాదు. ఆయనకు మంచి ఫ్రెండ్, గైడ్‌లా వ్యవహరించిన మహిళ అని కేతకీ నారాయణ్ చెప్పారు.
వైఎస్ జగన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల సమయంలో వైఎస్ భారతీ లైఫ్‌లో ఎమోషనల్ జర్నీ ఉంది. ఆమె రోల్ కోసం క్యాస్టూమ్ ధరించినప్పుడు కలిగిన ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. అలాంటి అనుభూతిని కలిగిన పాత్రలో కనిపించడం హ్యాపీగా ఉంది అని కేతకీ నారాయణ్ అన్నారు.

వైఎస్ భారతీని ఎన్నడూ కలువలేదు. ఎందుకంటే వారు చాలా బిజీగా ఉంటారు. అందుకే వారిని డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేక కలువలేదు. ఎప్పుడైనా అవకాశం దొరికితే ఆమెను కలువాలని ఉంది. ఆమె చేతిని ముద్దు పెట్టుకోవాలని ఉంది. ఈ సినిమా ఫాదర్, సన్ రిలేషన్. వారిద్దరి మధ్యలో ఉండే ఎమోషన్స్ బాగుంటాయి అని కేతకీ నారాయణ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











