twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘యాత్ర’ దర్శకుడు ‘సిండికేట్’ అవుతాడట.. ఇంతకీ ఎవరితో..?

    |

    మహీ వీ రాఘవ్.. గతంలో ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తీయబోతున్నట్లు ప్రకటించాడో.. అప్పటి నుంచి ఈయన పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోయింది. వాస్తవానికి 'పాఠశాల' అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన మహీ.. ఆ తర్వాత 'ఆనందో బ్రహ్మ'తో అందరి దృష్టిలో పడ్డాడు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. దర్శకుడిగా ఆయనకు మంచి మార్కులే వచ్చాయి. ఇందులో అతడు ఎంచుకున్న సబ్జెక్ట్, టేకింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

    ఇక, వైఎస్సార్ బయోపిక్‌తో ఆయన స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ప్రధానాంశంగా తీసుకుని 'యాత్ర' అనే టైటిల్‌తో మహీ వీ రాఘవ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. వైఎస్ అభిమానులే కాకుండా సామాన్యులు కూడా దీన్ని మెచ్చుకున్నారు.

    Yatra director big announcement

    కానీ, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాత్రం అనుకున్న వ‌సూళ్లు సాధించ‌డంలో వెన‌క‌బ‌డిపోయింది ఈ చిత్రం. హిట్ టాక్ సంపాదించుకున్నప్పటికీ, కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. అయితే, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ రోల్ చేయగా.. జగపతిబాబు, అనసూయ, రావు రమేష్, సుహాసిని, నాజర్ సహా తదితరులు నటించారు.

    ఇక, ఈ సినిమా తర్వాత మహీ.. మరో సినిమాను పట్టాలెక్కించలేదు. దీంతో అతడి సినిమా ఎప్పుడు ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. తాజాగా అందరి ఎదురు చూపులకు ఆయన బ్రేక్ వేశారు. తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశారు.

    అందులో 'ఎవరైనా డైరెక్టర్‌కు కథ చెప్పడం కంటే తర్వాతి సినిమాను ఎలా తెరకెక్కించాలి అన్న ఆలోచనే ఎక్కువగా ఉంటుంది. బాక్సాఫీస్ ట్రెండ్స్‌, బడ్జెట్‌, నటీనటులు ఇవేవి కథను ఎంచుకోడానికి ఉపయోగపడవు. సైలెంట్‌గా ఉన్న సమయంలో వచ్చే ఏదైనా థాట్.. ఇదే నువ్వు చెప్పాల్సిన కథ అని నాకు తెలియజేస్తుంది. నా తదుపరి చిత్రం ఓ యాక్షన్‌ డ్రామా. టైటిల్‌ 'సిండికేట్‌'. త్వరలోనే ఈ కథ, పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా, ఆ స్క్రిప్ట్ సినిమాగా వస్తుందని ఆశిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు.

    English summary
    Mahi v raghav began his film career as co producer for the movie Villagelo Vinayakudu and Kudirithe Kappu Coffee. He is one of the owners of Moonwater Pictures Production Company. In 2014 Mahi debuted in direction with the movie Pathasala, which is written by mahi himself.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X