twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'యాత్ర'లో వాట్సాప్ డైలాగ్.. ఆ క్రెడిట్ వైఎస్ఆర్ అభిమానిదే.. దర్శకుడు మహి వి రాఘవ్!

    |

    దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 2003లో చేసిన పాదయాత్ర నేపథ్యంలో యాత్ర చిత్రాన్ని రూపొందించారు. మహి వి రాఘవ్ వైఎస్ఆర్ జర్నీని యాత్ర చిత్రంలో ఎమోషనల్ గా చూపించారు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర వైఎస్ఆర్ అభిమానులని ఆకట్టుకుంటోంది. వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ దిగ్గజం మమ్ముట్టి నటించారు. యాత్ర చిత్రంపై సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర చిత్రంలో ఓ డైలాగ్ గురించి ఆసక్తికర విశేషాలు తెలిపాడు.

     ఉమ్మడి రాష్ట్రంలో

    ఉమ్మడి రాష్ట్రంలో

    2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ ప్రజలకు చేరువయ్యారు. పాదయాత్ర సమయంలో వైఎస్ఆర్ దృష్టికి ప్రజల నుంచి అనేక సమస్యలు వినిపించాయి. అధికారంలోకి రాగానే ఆ సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి అద్భుత పథకాల్ని రూపొందించారు. ఈ అంశాల ఆధారంగానే దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర కథని సిద్ధం చేసుకున్నాడు.

    వాట్సాప్ డైలాగ్

    వాట్సాప్ డైలాగ్

    మహి వి రాఘవ్ యాత్ర చిత్రం గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తాను వైఎస్ఆర్ అభిమాని రాసిన ఓ డైలాగ్ ని వాడుకున్నానని తెలిపారు. ఆ డైలాగ్ తనకు వైఎస్ఆర్ అభిమాని నుంచి వాట్సాప్ లో వచ్చిందని మహి వి రాఘవ్ తెలిపాడు. ఈ సందర్భంగా అతడికి తాను కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. ఆ అజ్ఞాతవ్యక్తి పేరు మాత్రం దర్శకుడు రివీల్ చేయలేదు. ఆ డైలాగ్ కూడా కాలేజీ ఫీజులకు సంబంధించినదే.

    ఓడిపోతే వచ్చి నన్ను కలవండి

    ఓడిపోతే వచ్చి నన్ను కలవండి

    యాత్ర చిత్రంలో వైఎస్ఆర్ పాత్రలో ఉన్న మమ్ముట్టి పాదయాత్ర చేస్తుండగా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల కాలేజీ ఫీజులు కట్టలేక పడుతున్న ఇబ్బందులని వివరిస్తారు. వారి సమస్యలని విన్న వైఎస్ఆర్.. నేను గెలిస్తే వెళ్లి కాలేజీ యజమాన్యాలని కలవండి.. ఒక వేళ ఓడిపోతే వచ్చి నన్ను కలవండి అని అంటాడు. ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

    <strong>‘యాత్ర'లో ఆ సీన్లు చూసినపుడు సిగ్గేసింది: రావు రమేష్</strong>‘యాత్ర'లో ఆ సీన్లు చూసినపుడు సిగ్గేసింది: రావు రమేష్

    కీలక పాత్రల్లో

    కీలక పాత్రల్లో

    యాత్ర చిత్రంలో వైఎస్ఆర్ ఆత్మగా పిలవబడే కెవిపి రామచంద్రరావు పాత్రలో రావు రమేష్ నటించాడు. అనసూయ, పోసాని కీలక పాత్రలో నటించారు. నటి ఆశ్రిత యాత్ర చిత్రంలో వైఎస్ సతీమణి విజయమ్మగా నటించారు. ఈ చిత్రంలో మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో జీవించారనే ప్రశంసలు దక్కుతున్నాయి. మమ్ముట్టే డబ్బింగ్ కూడా చెప్పారు.

    English summary
    Yatra director Mahi V Raghav reveals interesting details about one particular dialogue
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X