‘యాత్ర’ మూవీ చూసిన రామ్ గోపాల్ వర్మ.. ఏమన్నారంటే?
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'యాత్ర'. వైఎస్ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. మహి.వి.రాఘవ దర్శకుడు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
తాజాగా ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వీక్షించారు. అనంతరం ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ సినిమా తీసిన విధానం, దర్శకుడు మహి వి రాఘవ్ పని తీరుపై ప్రశంసల వర్షం కురిపించారు.
'యాత్ర' ఒక అద్భుతమైన చిత్రం. వైఎస్ఆర్ పాత్రను చూపించిన విధానం చాలా బావుంది. ఆయన ఒక గొప్ప నాయకుడు. వైఎస్ఆర్‌ను సజీవంగా తెరపైకి తీసుకొచ్చిన మహి వి రాఘవ్‌ను అభినందించకుండా ఉండలేక పోతున్నాను. మమ్ముట్టి.. వైఎస్ పాత్రలో జీవించారు' అంటూ వర్మ ట్వీట్ చేశారు.

'యాత్ర' సినిమా విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విమర్శకుల నుంచి సైతం మంచి రేటింగ్స్ వచ్చాయి. అయితే కలెక్షన్ల పరంగా చూసుకుంటే ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ ఉందని చిత్ర బృందం వెల్లడించింది.
'యాత్ర' సినిమా చూసిన తర్వాత వైఎస్ఆర్ అభిమానులు నుంచి తనకు వేలాది ఫోన్స్ వస్తున్నాయని, మహానేతపై ఇంత అభిమానం ఉంటుందని తాను ఊహించలేదని, ఈ విషయం ముందే తెలిస్తే సినిమా తీసేవాడిని కాదని, అంత ధైర్యం తనకు లేదని దర్శకుడు మహి వి రాఘవ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











