బాలయ్య మూవీస్ చూడనంటున్న ‘యాత్ర’ దర్శకుడు, మహేష్ ప్లాప్ మూవీపై...

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై రూపొందుతున్న 'యాత్ర' సినిమాకు దర్శకత్వం వహిస్తున్న మహి వి రాఘవ్ సినిమా ప్రమోషన్లలో బిజీ అయ్యారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్న నేపథ్యంలో ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన టాలీవుడ్ స్టార్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

YSR Biopic 'Yatra' Movie Director Mahi V Raghav Exclusive Interview With Filmibeat Telugu

కొందరు టాప్ స్టార్ల పేర్లు చెప్పగానే మీకు గుర్తొచ్చే అంశం ఏమిటి? అనే ప్రశ్నకు... ఆయా స్టార్లు చేసిన సినిమాల్లో తనకు నచ్చినవి చెప్పుకొచ్చారు. చిరంజీవి పేరు వినగానే 'ఖైదీ' చిత్రం గుర్తొస్తుందని, నాగార్జున పేరు వినగానే 'గీతాంజలి' గుర్తుకొస్తుందన్నారు.

మహేష్ బాబు ప్లాపు సినిమా...

మహేష్ బాబు ప్లాపు సినిమా...

వెంకటేష్ పేరు చెప్పగానే ‘కలిసుందాం రా', వపన్ కళ్యాణ్ పేరు చెప్పగానే ‘బద్రి' చిత్రం గుర్తొస్తుందని తెలిపారు. ఎందుకో తెలియదు కానీ మహేష్ బాబు ‘ఖలేజా' మూవీ తనకు బాగా నచ్చిందని మహి వి రాఘవ్ తెలిపారు. ఖాలేజా బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.

బాలయ్య సినిమాలు చూడను

బాలయ్య సినిమాలు చూడను

బాలయ్య పేరు ప్రస్తావించగానే... నేను ఆయన సినిమాలు ఎక్కువగా చూడను. అందుకే నాకు ఏ సినిమాలు గుర్తుకురావు.. అయితే ఆయన ఎప్పుడో నటించిన ‘ముద్దుల మామయ్య' చిత్రం గుర్తుకు వస్తుందని మహి వి రాఘవ్ తెలిపారు.

ఈ తరం స్టార్స్ గురించి...

ఈ తరం స్టార్స్ గురించి...

ఈ తరం స్టార్స్ గురించి ప్రశ్నించగా... అల్లు అర్జున్ అంటే ‘సరైనోడు', జూ ఎన్టీఆర్ అంటే ‘నాన్నకు ప్రేమతో', రామ్ చరణ్ అంటే ‘రంగస్థలం', ప్రభాస్ అంటే ‘బాహుబలి', విజయ్ దేవరకొండ అంటే ‘అర్జున్ రెడ్డి' చిత్రం గుర్తుకు వస్తుందన్నారు.

యాత్ర

యాత్ర

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'యాత్ర'. ఇందులో వైఎస్ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించనున్నారు. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ళ‌యాలంలో 'యాత్ర' ఫిబ్ర‌వ‌రి 8న రిలీజ్ కాబోతోంది. ఈచిత్రానికి సినిమాటోగ్రాఫర్ - సత్యన్ సూర్యన్, మ్యూజిక్ - కె ( క్రిష్ణ కుమార్ ), ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్, సాహిత్యం - సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ప్రొడక్షన్ డిజైన్ - రామకృష్ణ, మోనిక సబ్బాని, సౌండ్ డిజైన్ - సింక్ సౌండ్, సమర్పణ - శివ మేక, బ్యానర్ - 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు - విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - మహి వి రాఘవ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X